/rtv/media/media_files/2025/02/20/ka81PSuC2fLlbKQtHP0L.jpg)
delhi cm Photograph: (delhi cm )
Delhi: భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఢిల్లీ పరిపాలన భిన్నమైది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న కొన్ని ముఖ్యమైన పూర్తి స్థాయి అధికారాలు ఢిల్లీ సీఎంకు ఉండవు. అయితే 27 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేజిక్కించుకోగా తొలిసారి ఎమ్మెల్యే అయిన రేఖ గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపికయ్యారు. కానీ ఆమెకు పూర్తిగా అధికారం లభించదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ప్రత్యేక అధికారాలు రేఖకు ఉండవు. ఆ అధికారాలు ఏమిటి? ఢిల్లీ ప్రభుత్వానికి అవి ఎందుకు ఉండవో ఒకసారి తెలుసుకుందాం.
ఆర్టికల్ 239AA ప్రకారం ఢిల్లీ పరిపాలన..
ఢిల్లీ ఒక కేంద్రపాలిత ప్రాంతం, దేశ రాజధాని కూడా. అందువల్ల ఇది దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ అధికారాలను చాలా వరకు తన వద్దే ఉంచుకుంటుంది. ఢిల్లీకి పాక్షిక రాష్ట్ర హోదా ఉన్నప్పటికీ ఢిల్లీ పరిపాలన రాజ్యాంగంలోని ఆర్టికల్ 239AA ప్రకారం నిర్వహించబడుతుంది. ఢిల్లీకి శాసనసభ ఉంటుంది కానీ కొన్ని అధికారాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటాయి.
1. పోలీసులపై నియంత్రణ లేకపోవడం:
– ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు.
– ఢిల్లీ ప్రభుత్వానికి శాంతిభద్రతలు, నేర నియంత్రణపై అధికారం ఉండదు.
- ఢిల్లీలో ఏదైనా అల్లర్లు లేదా శాంతిభద్రతల సమస్య తలెత్తితే.. పోలీసులకు నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వలేరు.
2. భూమిపై నియంత్రణ లేదు:
– ఢిల్లీలోని భూమికి సంబంధించిన అన్ని విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.
– రియల్ ఎస్టేట్ లేదా ప్రభుత్వ భూమిపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యక్ష నిర్ణయాలు తీసుకోదు.
3. శాంతిభద్రతలపై అధికారం లేదు:
– ఢిల్లీ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం కేంద్ర ప్రభుత్వం బాధ్యత.
– ఢిల్లీ ప్రభుత్వం ఏ రకమైన భద్రతా దళాలను మోహరించాలన్న లేదా తొలగించాలన్న నిర్ణయం తీసుకోలేదు.
4. మున్సిపల్ కార్పొరేషన్ (MCD) పై పూర్తి నియంత్రణ లేకపోవడం:
– ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఒక ప్రత్యేక సంస్థగా పనిచేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తుంది.
– ఢిల్లీ ప్రభుత్వానికి శుభ్రత, రోడ్డు మరమ్మతులు వంటి మున్సిపల్ సేవలపై పరిమిత అధికారాలున్నాయి.
5. ప్రతి పనికి గవర్నర్ (లెఫ్టినెంట్ గవర్నర్ - LG) ఆమోదం అవసరం:
– ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) పాత్ర చాలా ముఖ్యమైనది.
– ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన అనేక చట్టాలు, విధానాలను అమలు చేయడానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం అవసరం.
– లెఫ్టినెంట్ గవర్నర్‌కు కొన్ని సందర్భాల్లో వీటో అధికారం కూడా ఉంటుంది. ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపవచ్చు.
– ఇది ఇతర రాష్ట్రాలలో జరగదు.
పూర్తిస్థాయి హోదా కోసం ఫైట్:
ఢిల్లీ ముఖ్యమంత్రులు పూర్తి అధికారాలు పొందగలిగేలా పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ముందంజలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. తన పదవీకాలంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు పోలీసు, భూమి వంటి ముఖ్యమైన రంగాలపై నియంత్రణ ఎందుకు ఉండకూడదనే అంశాన్ని ఆయన పదే పదే లేవనెత్తారు. హక్కుల పోరాటంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. పూర్తి రాష్ట్ర హోదా కోసం అనేకసార్లు లెఫ్టినెంట్ గవర్నర్ (LG)తో చర్చలు, ఘర్షణలు జరిగాయి.
మదన్ లాల్ ఖురానా ఏమి చెప్పారు?
మదన్ లాల్ ఖురానా (1993–1996) ఢిల్లీకి ఎన్నికైన మొదటి ముఖ్యమంత్రి. పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను కూడా ఆయన లేవనెత్తారు. బీజేపీ పాలనలో ఢిల్లీ ప్రభుత్వానికి శాంతిభద్రతలు, భూమిపై అధికారం లేకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.
మరిన్ని హక్కుల కోసం షీలా డిమాండ్:
షీలా దీక్షిత్ (1998–2013) తన సుదీర్ఘ పదవీకాలంలో ఢిల్లీ ప్రభుత్వానికి మరిన్ని పరిపాలనా అధికారాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోలీసు, భూ నియంత్రణపై అధికారం ఉండాలని వాదించారు. తద్వారా శాంతిభద్రతలను మెరుగుపరచడం, పథకాలను మెరుగైన రీతిలో అమలు చేయడం సులభం అవుతుందన్నారు. అయితే ఆమె పార్టీ (కాంగ్రెస్) కేంద్రంలో అధికారంలో ఉన్నందున కేజ్రీవాల్ లాగా డిమాండ్ చేయలేకపోయారు.
పూర్తి రాష్ట్ర హోదా డిమాండ్ ఎందుకు?
శాంతిభద్రతలు, పోలీసు, భూ నియంత్రణ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం వల్ల ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దేశ రాజధాని కావడంతో ఢిల్లీ భద్రత, భూమికి సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, స్థానిక నేతలు ఇది వారి అధికారాలను పరిమితం చేస్తూ జవాబుదారీతనాన్ని తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తేడా ఏమిటి?
ఢిల్లీ భారతదేశ రాజధాని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాని భద్రత, పరిపాలనపై ప్రత్యక్ష నియంత్రణను కోరుకుంటుంది. ఈ కారణంగా ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వట్లేదు.
ఇది కూడా చదవండి: Sheinbaum: ట్రంప్ బెదిరింపులకు భయపడం.. మెక్సికో అధ్యక్షురాలు షేన్‌బామ్