America - Britan: ట్రంప్‌ తో ప్రపంచీకరణ ముగిసినట్లే!

అమెరికా ఫస్ట్‌ నినాదంతో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచ దేశాల పై భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఆయన చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టారని బ్రిటన్‌ ప్రధాని మంత్రి కీర్‌ స్టార్మర్‌ ఇటీవల పేర్కొన్నారు.

New Update
keir

keir

అమెరికాఫస్ట్‌ నినాదంతో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచ దేశాల పై భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఆయన చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టారని బ్రిటన్‌ ప్రధాని మంత్రి కీర్‌ స్టార్మర్‌ ఇటీవల పేర్కొన్నారు. 1991లో సోవియట్‌ యూనియన్ పతనంతో ప్రారంభమైన ప్రపంచీకరణ ఇక్కడితో ముగిసిపోయిందని ఆయన సోమవారం ప్రకటించాలనుకుంటున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. 

Also Read:  Israel-Uk:యూకే ఎంపీలను నిర్బంధించిన ఇజ్రాయెల్‌!

టైమ్స్‌ నివేదిక ప్రకారం..ఆర్థిక జాతీయ వాదం విషయంలో అమెరికా తీసుకుంటున్న చర్యలను స్టార్మర్‌ కూడా అంగీకరించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త యుగం ప్రారంభమైయ్యిందని అమెరికా అధ్యక్షుడి విధానాన్ని అందులోని వారు సమర్థిస్తున్నారని ఆయన గుర్తించారు. ప్రపంచీకరణ చాలా మంది శ్రామికలకు అనుకూలంగా ఉండదన్నారు. దీనికి వాణిజ్య యుద్ధాలు సమాధానం అని మేము నమ్మడం లేదని అనుకున్నారు.

Also Read: Sri Rama Navami 2025: నవమి రోజే సీతారాముల కల్యాణం ఎందుకు చేస్తారో... తెలుసా!

Amid Trump Trade War

ప్రత్యామ్నాయం చూపేందుకు ఇదొక అవకాశంగా స్టార్మర్‌ ఇటీవల అభివర్ణించడం గమనార్హం. వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల పోటీ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ ఉత్పాదకతను పెంచడానికి కృషి చేస్తాయన్నారు.  గత నెల హాంకాంగ్‌ లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో హెచ్‌ఎస్‌బీసీ చీఫ్‌ సర్‌ మార్క్‌ టక్కర్‌ అమెరికా అనుసరిస్తున్న పన్నుల విధానం పై  ప్రసంగించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు,ట్రంప్‌ వాణిజ్య విధానాలతో అంతర్జాతీయ సమాజం మొత్తం చిన్న ప్రాంతీయ బ్లాక్‌ లు క్లస్టర్లుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు.భవిష్యత్తులో వాటి మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు నెలకొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఈ క్రమంలో స్టార్మర్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Also Read:Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

keir-starmer | america | trump | britan | prime-minister | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనా, ఆమె కూతురు, మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి.

New Update
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి  తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అధికార దుర్వినియోగంతో అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారని హసీనాతో పాటు 
ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరికొందరపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.  

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ఇక వివరాల్లోకి వెళ్తే.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి రెహనా, బ్రిటీష్ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిక్‌, మరో 50 మందిపై అవినీతి నిరోధక కమిషన్ బంగ్లాదేశ్‌ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై పరిశీలన చేసిన కోర్టు.. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని పలు మీడియా కథనాలు తెలిపాయి. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసినట్లు చెప్పాయి. మరోవైపు అక్రమంగా నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై షేక్‌ హసీనా, ఆమె కూతురు సైమా వాజెద్‌ పుతుల్, మరో 17 మందిపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.   

Also Read: జలియన్ వాలాబాగ్‌ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్‌ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?

ఢాకా శివారులో ఉన్న పుర్బాచల్‌లో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి లీజుకు సంబంధించిన అభియోగంపై ఏసీసీ తన దర్యాప్తు రిపోర్టును కోర్టుకు సమర్పించింది. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఢాకాలో ఇళ్లు ఉన్నప్పటికీ.. నివాసం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉండటం వల్ల ఇటీవల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.అయితే తాజాగా మరోసారి కోర్టు అరెస్టు వారెంట్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Also read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

 telugu-news | rtv-news | sheik-hasina | international

 

Advertisment
Advertisment
Advertisment