తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు తెలుగు రాష్టాల్లో స్వల్పంగా భూప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలంతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేటలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 7:26 నిమిషాల సమయంలో 3 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. By Kusuma 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు! తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశామని, లబ్ది దారులందరికీ న్యాయం చేస్తామన్నారు. By srinivas 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Maoists: ఏజెన్సీలో హైటెన్షన్.. ఓ వైపు వారోత్సవాలు.. మరోవైపు కూంబింగ్! నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుంటే.. మరోవైపు పోలీసు బలగాలు భారీ కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. By Nikhil 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణపై ఫెంగల్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో వానలు! తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. By Bhavana 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 14 ఏళ్ల తర్వాత ఉలిక్కిపడ్డ ఓరుగల్లు.. మావోయిస్టుల దారెటు? 14 ఏళ్ల తర్వాత ఓరుగల్లు ఉలిక్కిపడింది. మావోయిస్టు-పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. తెలంగాణలో తలదాచుకోవాలని చూస్తున్న మావోయిస్టులకు భద్రతా బలగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల దారెటు అనేది చర్చనీయాంశమైంది. By srinivas 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ US Gun Fire: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం! అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన నూకారపు సాయితేజ కాల్పుల్లో కన్నుమూశాడు. 4 నెలల క్రితం చికాగో కాంకోడియా యూనివర్శిటీలో ఎంఎస్ చదివేందుకు అమెరికి వెళ్లిన్నాడు. సాయితేజ మృతితో స్వస్థలం ఖమ్మంలో విషాధ చాయలు అలుముకున్నాయి. By Vijaya Nimma 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rain Alert: రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు! TG: రాష్ట్రంలో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ సూచించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. By V.J Reddy 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే ఇస్తాం.. సీఎం అధికారిక ప్రకటన! ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నిన్ను సంపే పోతా.. భర్తను కూరగాయల కత్తితో పొడిచిన భార్య! కుటుంబ కలహాలతో ఓ భార్య తన భర్తను కూరగాయల కత్తితో పొడిచిన ఘటన ఖమ్మం జిల్లా గొళ్లపూడిలో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పనిచేస్తున్న లక్ష్మి భర్త రవి విసిగిస్తున్నాడే కోపంతో పొడిచింది. రవిని ఆస్పత్రికి తరలించి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn