AP Cabinet: తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ.. ఏపీ కేబినెట్ వరాల జల్లు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ నిధులు సైతం రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది.