author image

srinivas

By srinivas

వరద బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వానికి CMR సంస్థ భారీ విరాళం అందించింది. శనివారం విజయవాడలో సీఎం చంద్రబాబుకు రూ. 50 లక్షల చెక్కును సంస్థ చైర్మన్ మావూరి వెంకటరమణ అందించారు. ఆపత్కాలంలో విరాళం ఇచ్చిన CMRకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

By srinivas

ప్రముఖ రచయిత్రి, బొజ్జా తారకం సతీమణి బి.విజయభారతి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానూభూతి తెలిపారు. సాహితీ రంగంలో ఆమె సేవలు అపారమైనవంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా విజయభారతికి నివాళి అర్పించారు. Latest News In Telugu | Short News

By srinivas

జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్ధలవుతున్నాయి. తొలిరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.70 కోట్లకుపైగా వసూల్ చేసినట్లు సమాచారం. 

By srinivas

ఫుడ్ కాంట్రాక్టు విషయంలో లంచం తీసుకుంటూ హైదరాబాద్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్‌ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.  క్రైం | Latest News In Telugu | Short News

By srinivas

రేషన్, హెల్త్ కార్డులకు సంబంధించి మహిళలకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి కార్డుపై మహిళే యజమానిగా ఉండనున్నట్లు తెలిపారు. తెలంగాణ | Latest News In Telugu | Short News

By srinivas

హైడ్రా అంటే భయం కాదు భరోసా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 'కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యం. పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టట్లేదు' అని స్పష్టం చేశారు.  

By srinivas

2025లో నిర్వహించబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి పెట్టాలంటూ CBSE ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. నేషనల్ | Latest News In Telugu | Short News

By srinivas

జగన్‌ను మర్డర్ చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. కరడుగట్టిన హిందూ వ్యతిరేకి అయిన బాబు కుట్రతోనే జగన్‌పై లడ్డూ బురద జల్లుతున్నారన్నారు. మోదీనే కాదు బతికుంటే అంబేడ్కర్‌ను కూడా మోసం చేసేవాడని మండిపడ్డారు. 

By srinivas

యూట్యూబర్ హర్షసాయి మరో ఆడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 'రూ.10 కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా. నా బ్రాండ్ వాల్యూ తగ్గించుకోను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంతైనా ఇస్తారు. క్రైం | Latest News In Telugu | Short News

By srinivas

తెలంగాణలో మరోసారి గ్రూప్ -1 పై నియామకాలపై వివాదం మొదలైంది. మెయిన్స్​ పరీక్షలకు ఇంకో 20 రోజులు మాత్రమే సమయం ఉండగా.. గ్రూప్ -1 కొత్త నోటిఫికేషన్ చెల్లదంటూ వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన జి.దామోదర్‌రెడ్డి మరో అయిదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు