/rtv/media/media_files/2025/04/05/xakFcXaJ6HI9jTgO6pjT.jpg)
tractor accident in MH
కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
#नांदेड तालुक्यात #आलेगाव येथे ट्रॅक्टर ट्रॉली विहिरीत पडल्याने 7 #शेतमजूर महिलांचा मृत्यू तर 3 जखमी. प्रशासनाकडून तातडीचे #मदत कार्य. प्रधानमंत्री व मुख्यमंत्र्यांकडून #मदत जाहीर.@MahaDGIPR@CMOMaharashtra@rahul_kardile2@CeoNanded@NandedPolice@InfoMarathwada@InfoDivLatur pic.twitter.com/rLLz6vRc3r
— District Information Office, Nanded (@InfoNanded) April 4, 2025
महाराष्ट्र के नानदेड में बड़ा हादसा..
— Vivek Gupta (@imvivekgupta) April 4, 2025
ट्रैक्टर ट्रॉली कुएं में गिरी..
7 लोगो की मौत..
कुछ और लोगों की तलाश जारी.#Maharashtra pic.twitter.com/CQQlJ69sXZ
Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ