/rtv/media/media_files/2025/04/06/RSSYTirt8nqe4YucraO6.jpg)
Delhi woman dies after falling from Roller Coaster
నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నుండి కింద పడి 24 ఏళ్ల ప్రియాంక మృతి చెందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే
ఏం జరిగిందంటే?
నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంకతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. అక్కడ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో గురువారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. అదే సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగి ఆమె కింద పడిపోయింది. దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం
పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో మృతిచెందిన మృతురాలు ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ENT రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద పంక్చర్ గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: డేంజర్.. ఇలాంటి సన్‌స్క్రీన్ లు వాడితే ముఖంపై తెల్లటి మచ్చలు!
కాగా చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రియాంకకు ఫిబ్రవరి 2026లో వివాహం జరగాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: కూల్ డ్రింక్స్ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్‌గా ఇలా చేసుకోండి!
(crime news | latest-telugu-news | telugu-news )