/rtv/media/media_files/2025/04/02/SZRMlQqbTDWILIRadFYc.jpg)
Waqf Board Bill Photograph: (Waqf Board Bill)
దేశంలో అత్యధిక భూములు ఇండియన్ రైల్వేస్ పేరు మీద ఉన్నాయి. అవి దేశ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. తర్వాత రక్షణ శాఖ కింద ఉన్నాయి. ఇవి కూడా దేశ భద్రత కోసం వాడుకుంటున్నాము. ఆ తర్వాత అత్యధిక భూములు వక్ఫ్ బోర్డులకు చెందినవే ఉన్నాయి. ఇవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? వీటిని వల్ల ఎవరు లాభపడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అసలు వక్ఫ్ బోర్డుకు అన్న వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయి? వాటి మీద ఎవరికి అధికారం ఉంది? అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్ధాం.
సింపుల్‌గా చెప్పాలంటే. వక్ఫ్ అనేది ధార్మిక లేదా మతపరమైన విరాళం. ఇది ఎక్కువగా ముస్లింలు ఆస్తి రూపంలో ఇస్తారు. ఈ విరాళాలు చెల్లుబాటు అయ్యే డాక్యుమెంటేషన్ లేకుండా ఇవ్వబడతాయి. అటువంటి విరాళాల నుండి వచ్చే నిధులను మసీదులు, స్మశానవాటికలు, మదర్సాలు మరియు అనాథాశ్రమాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. ఒక ఆస్తిని వక్ఫ్‌గా నియమించిన తర్వాత, దానిని బదిలీ చేయడం లేదా అమ్మడం సాధ్యం కాదు. గతంలో వక్ఫ్ చట్టాలు అలా తయారు చేశారు. దేశంలోని 8.72 లక్షల ఆస్తులను వక్ఫ్ బోర్డులు కంట్రోల్ చేస్తున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అవి 9.4 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ డేటా ప్రకారం.. భారతదేశంలో 9.4 లక్షల ఎకరాల్లో 8.7 లక్షల ఆస్తులను వక్ఫ్ బోర్డులు నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ. 1. 2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వక్ఫ్ హోల్డింగ్‌ను కలిగి ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. వక్ఫ్ బోర్డు కింద 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అలాగే వక్ఫ్ బోర్డు కింద 3,56,051 వక్ఫ్ ఎస్టేట్‌లు కూడా నమోదయ్యాయి. వీటి మీద ప్రభుత్వంతో సహా ఎవరికీ అధికారం ఉండదు.
వీటి నిర్వాహణ కోసం 1947 కంటే ముందు నుంచే లక్షల ఎకరాల భూములు అప్పటి రాజులు, సంస్థానాదీలు కేటాయించారు. అయితే స్వాతంత్ర్యం వచ్చాక కూడా వాటిని అలాగే ఉంచారు. అంతేకాదు వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటానికి ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొచ్చారు. అందులో ఒకటే వక్ఫ్ చట్టం 1995. ఆ చట్టానికి సవరించాలని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లు-2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణలో ఉన్న సమస్యలు, వాటి సవరణలు సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. ఎనిమిది గంటల పాటు ఈ బిల్లుపై చర్చిస్తారు. అనంతరం సభ ఆమోదం కోసం స్పీకర్ ఓటింగ్ నిర్వహించనున్నారు.
#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "A case ongoing since 1970 in Delhi involved several properties, including the CGO Complex and the Parliament building. The Delhi Waqf Board had claimed these as Waqf… pic.twitter.com/qVXtDo2gK7
— ANI (@ANI) April 2, 2025
2024 ఆగస్టులోనే బిల్లును ప్రవేశ పెట్టిన మంత్రి రిజుజు.. ఆ తర్వాత జేపీసీ సమీక్షకు పంపారు. ఫిబ్రవరి 27న జేపీసీ 14 సవరణలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత బుధవారం( ఏప్రిల్ 2)న బిల్లును పార్లమెంటులో రెండవసారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వక్ఫ్ బిల్లు ఎందుకు తీసుకురావాల్సిందో వివరిస్తూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు వల్ల ముస్లీంలకు ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజూ అన్నారు. మత విశ్వాసాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం ఉండదని బిల్లును వ్యతిరేఖిస్తున్న వారు తెలుసుకోవాలని ఆయన సూచించారు. వక్ఫ్ బోర్డుకు ఉన్న వేల ఎకరాలు దుర్వినియోగం అవుతున్నాయని, వాటిని ప్రజలకు ఉపయోగపడేలా చేసేందుకే ఈ చట్టంలో మార్పులు తెస్తున్నామని ఆయన అన్నారు.
వక్ఫ్ ప్రాపర్టీలను సాధారణ, పేద, అణగారిన ముస్లింల సంక్షేమం, లబ్ధి కోసం ఎందుకు వాడలేదని కేంద్రమంత్రి కిరణ్ రిజుజీ ప్రశ్నించారు. సాధారణ ముస్లింల సంక్షేమం కోసం వక్ఫ్ ప్రాపర్టీలను వాడాల్సిన సందర్భం వచ్చిందన్నారు. 2004 లెక్కల ప్రకారం. దేశంలో 4.9 లక్షల వక్ఫ్ ప్రాపర్టీలు ఉన్నాయన్నారు. వాటి నుంచి వస్తున్న ఆదాయం 163 కోట్లుగా పేర్కొన్నారు. అయితే 2013లో వచ్చిన సవరణ తర్వాత ఆ ప్రాపర్టీల ఆదాయం 3 కోట్లు పెరిగిందన్నారు. అంటే వక్ప్ ఆదాయం 166 కోట్లకు చేరిందన్నారు. భారీగా ఉన్న ప్రాపర్టీల నుంచి తక్కువ స్థాయిలో ఆదాయం వస్తోందని, ఆ ప్రాపర్టీల నుంచి కనీసం 12 వేల కోట్ల ఆదాయం రావాలని మంత్రి రిజిజు పేర్కొన్నారు. వక్ప్ ప్రాపర్టీలను పేద ముస్లింల కోసం వినియోగించాలన్నారు. వక్ప్ బిల్లును ఆ లక్ష్యం కోసం సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. ఎవరి ప్రాపర్టీని లాక్కోవడం లేదన్నారు.
ముస్లీలు వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముల్లీమేతరులను నియమిస్తే ముస్లీల ప్రాధాన్యత తగ్గుతుందని ఆరోపిస్తున్నారు. ఏళ్ల నాటి నుంచి వస్తున్న వక్ఫ్ బోర్డు భూములు ఇతరుల పాలైతాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను ఇండియాతోపాటు, ఇతర దేశాల మత పెద్దలు కూడా వ్యతిరేకిస్తున్నారు.
ఏదైనా ఆస్తి వక్ఫ్ ఆస్తి కాదా అని నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉండాలని బిల్లు ప్రతిపాదిస్తుంది 1995 వక్ఫ్ బోర్డు చట్టంలోని అత్యంత కఠినమైన నిబంధన సెక్షన్ 40. దీని కింద వక్ఫ్ బోర్డు ఏదైనా భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించవచ్చు. కానీ ప్రస్తుతం ఈ సవరణతో దాన్ని తొలగించనున్నారు. దీని వల్ల చాలా ప్రభుత్వ భూములు వక్ఫ్ భూములుగా పరిగణించబడుతున్నాయి.
వక్ఫ్ బిల్లును ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకిస్తున్నది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 272 మంది సభ్యుల సాధారణ మెజార్టీ అవసరం. బీజేపీకి సొంతగా 240 మంది సభ్యులు ఉన్నారు. దాని మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ వంటి పలు పార్టీల బలంతో కలిపి 293గా ఉంది. సభకు తప్పకుండా హాజరుకావాలని, ఓటింగ్లో పాల్గొనాలని పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది.
#WATCH | Delhi | On Waqf Amendment Bill, Maulana Mohammed Fazlur Rahim Mujaddidi, General Secretary of All India Muslim Personal Law Board, says, "AIMPLB says, "With the amendments approved by the JPC, the matter has become more complicated. JPC mahaz ek fareb hai aur ek dhokha… pic.twitter.com/e3SAqkC2Iy
— ANI (@ANI) April 2, 2025
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు 298 మంది ఎంపీల మద్దతు ఉండగా.. వ్యతిరేకంగా 233 మంది సభ్యులు ఉన్నారు. మరో 11 మంది ఎంపీలు తటస్థంగా ఉన్నారు. ఇక రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 122 మంది ఎన్డీఏ ఎంపీల మద్దతు ఉండగా.. వ్యతిరేకంగా ఇండియా కూటమికి చెందిన 116 మంది ఎంపీలు ఉన్నారు. ఏ విధంగా చూసినా.. ప్రతిపక్షాలు సభల నుంచి వాకౌట్ చేయడం తప్పితే.. ఈ వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకునే అవకాశమే కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణముల్ కాంగ్రెస్ సహా ఎంఐఎం, ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉభయసభల్లో ఈ వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలతో రెడీ అవుతున్నాయి