/rtv/media/media_files/2025/04/06/lpQGQuCRlS9wHMWxvwBx.jpg)
srh 150 runes
ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు. ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.
#IPL2025 #SRHvsGT
— News18 CricketNext (@cricketnext) April 6, 2025
🚨INNINGS BREAK!🚨
Mohammed Siraj ran riot at his home venue in Hyderabad against SRH. His four-fer restricts SRH to just 152/8
GT Need 153 To Win
Follow the LIVE Updates here👇🔽https://t.co/Kr6J0WmoGg
సిరాజ్ అరుదైన రికార్డు
మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. 97 ఐపీఎల్ మ్యాచ్ లలో సిరాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 26 బౌలర్ గా నిలిచాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ ఘనత అందుకున్నాడు.
Also read : Husband attacks wife : కొండాపూర్ లో దారుణం.. గర్భిణి అయిన భార్యను చంపాలని...
Also read : మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం