/rtv/media/media_files/2025/04/06/pdPiXLnUjmvKd60dchiD.jpg)
terrorist arrest Photograph: (terrorist arrest)
భద్రతా దళాలు మణిపూర్‌లో వరుసగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో నిషేధిత తిరుగుబాటు గ్రూపులకు చెందిన అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అలాగే వారు వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌థౌఖోంగ్‌లో ఆదివారం ఓ టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యున్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ధృవీకరించారు. తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించి యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ సభ్యుడిని అరెస్టు చేశాయి.
Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు
02 #PLAM-RPF terrorists named Alex Sachindra Singh & Athoiba Meitei and 01 #KCP-CM militant named Okram Herojit Singh, were arrested from east Imphal, Manipur.
— Subcontinental Defender 🛃 (@Anti_Separatist) April 6, 2025
Search ops are on. pic.twitter.com/6iQK3iewwg
Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
బిష్ణుపూర్ జిల్లాలోని లైషోయ్ హిల్స్ ప్రాంతంలో జరిగిన సోదాల్లో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఒక SLR రైఫిల్‌తో కూడిన మ్యాగజైన్, ఒక కార్బైన్ మెషిన్ గన్, ఒక .303 రైఫిల్, ఒక డబుల్ బ్యారెల్ గన్, 48 రౌండ్ల మందుగుండు సామగ్రి, 2 గ్రెనేడ్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇతర వస్తువులు ఉన్నాయి. శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు భారీగా గన్స్ గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున, బిష్ణుపూర్, తౌబాల్ మరియు తూర్పు ఇంఫాల్ సహా వివిధ జిల్లాల నుండి 2 నిషేధిత సంస్థలు- యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG)లకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.