/rtv/media/media_files/2025/04/06/aHqq7cyvCzem7I8ngS8V.jpg)
AI Jibli Trend
ఎక్కడ చూడు ఇప్పుడు ఇప్పుడు జిబ్లీ ఫోటోలే. రకరకాలుగా తమ ఫోటోలను మార్చుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీని కోసం రీల్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఇన్స్టా, ఎక్స్ లు అయితే మొత్తం ఈ జిబ్లీ ట్రెండ్ తోనే నిండిపోయాయి. ఏఐ టూల్స్ దవారా మర ఒరిజినల్ ఫోటోలను యానిమేషన్ గా మార్చుకోవడమే జిబ్లీ. ఇందులో ఎక్కువ మంది వ్యక్తిగత లేది కుటుంబ ఫోటోలనే పెడుతున్నారు. అయితే ఈ వౌరల్ ట్రెండ్ తాజాగా ప్రైవసీకి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంటర్నెట్ ఏఐ ఎక్స్ పర్ట్ ఏఏఐతో వ్యక్తిగత ఫోటోలను పంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు. డేటా ప్రైవసీ, సెక్యురిటీ మీద పనిచేసే ప్రోటాన్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసింది. వ్యక్తిగత ఫొటోలను ఏఐ ఫ్లాట్‌ఫామ్‌లో అప్లోడ్ చేసిన తర్వాత వాటిని ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
దేనికైనా ఉపయోగించొచ్చు..
అయితే తర్వాత కాలంలో ఏఐ మోడల్స్ మన ఫోటోలను వాడుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మర పోలికలతో ఉన్న ఫోటోలను మన అనుమతి లేకుండా ఉపయోగించే అవకాశం ఉందని..అప్పుడు వద్దని అనడానికి కూడా వీలు ఉండదని చెబుతున్నారు. వాటిని మిస్ యూజ్ చేయోచ్చని హెచ్చరిస్తున్నారు. మనకు నచ్చని లేదా మన ప్రైవసీకి భంగం కలిగించే విధంగా లేదా పరువు తీసే విధంగా ఫోటోలను యూజ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ ఫోటోలను డీప్ ఫేక్ లో వాడినా వాడొచ్చని అంటున్నారు. పైగా ఏఐ టూల్స్‌తో ఫొటోలు, ఆలోచనలను పంచుకోవడం వల్ల మెటాడేటా, లొకేషన్, సెన్సిటివ్ డేటా బహిర్గతమయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
today-latest-news-in-telugu | chat gpt Ai | viral | trend
Also Read : దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ