/rtv/media/media_files/2025/03/11/ir2DYSRnkbX4kXZ72pNS.jpg)
Telangana Assembly approves BC Bill and SC classification
Telangana: తెలంగాణ అసెంబ్లీ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశ పెట్టగా ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును కేంద్రానికి పంపించనుండగా ఆమోదం కోసం పార్టీలన్నీ ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం కోరింది. దీనికి సంపూర్ణ మద్ధతు ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
ఇదో చారిత్రాత్మక ముందడుగు..
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇదో చారిత్రాత్మక ముందడుగుగా పేర్కొన్నారు. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రం చేయని కులగణనను తాము చేపట్టి పక్కా లెక్కలతో సభ ముందుకు బిల్లు తీసుకొచ్చామని చెప్పారు. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి: CM Revanth: చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
బీసీ బిల్లుపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీసీ బిల్లును బీఆర్ఎస్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందన్నారు. చట్టం వచ్చే వరకు అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడే ఆ వర్గాలు నిజంగా సంతోషిస్తాయన్నారు. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత అన్ని పార్టీలు తీసుకోవాలన్నారు. అయితే దీనిని రాజకీయ ఎత్తుగడగా చూడొద్దని ప్రభుత్వానికి సూచించారు. తమిళనాడు స్ఫూర్తితో అన్ని పార్టీలను ముందుండి నడిపించాలని చెప్పారు. ఈ బిల్లు పాస్ కావాలంటే ప్రతిపక్షంలో 100 మంది ఎంపీలు ఉన్నారని, దీనిపై రాహుల్ గాంధీ గట్టిగా పూనుకంటే బిల్లు మద్దతు పొందుతుందని సూచించారు.
ఇది కూడా చదవండి: Teenmar Mallanna: కేటీఆర్, హరీష్ తో మల్లన్న భేటీ.. కారణం అదేనా?
నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!
కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు పోటీగా అంబర్‌పేట్ నుంచి శోభాయాత్ర చేస్తున్నారన్నారు. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి టార్గెట్ గా ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీకు గులాంగిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్ల అంటూ ఫైర్ అయ్యారు, టేబుల్ తుడిచేవాళ్లకే పెద్ద పోస్టులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పోటీగా అంబర్‌పేట్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు కాదు.. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..
(kishan-reddy | telugu-news | telugu breaking news | latest-telugu-news)
హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు
Negligence of private doctors : వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి
YS sharmila: తల్లితో పాటు మేనల్లుడికి కూడా మోసం.. జగన్‌పై మరోసారి దుమ్మెత్తిపోసిన షర్మిల!
Realme 13 Pro Offer: కిర్రాక్ డిస్కౌంట్.. రెడ్ మీ ఫోన్ పై రూ.8వేల తగ్గింపు- వెరీ చీప్!
Viral Video: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?