Bomb threat : హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు

హనుమకొండ జిల్లా కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి కాల్ చేసి మరీ బెదిరించాడు. వెంటనే జిల్లాకోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు.

New Update
Hanumakonda District Court

Hanumakonda District Court

హనుమకొండ జిల్లాలోని కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేశాడు. జిల్లా కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి కాల్ చేసి మరీ చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన హనుమకొండ జిల్లా కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాంబు స్క్వాడ్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారు. హనుమకొండ కోర్టులోపల ఉన్నవారిని బయటకు పంపించారు. అనుమానస్ప ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేస్తోంది. పోలీసు జాగిలాలతోో కోర్టు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫోన్ చేసిన నెంబర్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తున్నారు. కోర్టులో నిజంగానే బాంబు ఉందా.. లేక బెందిరించాలని తమాషాకి అతను కాల్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!

ఏప్రిల్ 12న తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు అధికారులుఎల్లో అలర్ట్ జారీ చేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

New Update
Rains

Rains

భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. దక్షిణ భారతదేశంలో విస్తారమైన మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ మేఘాలు తూర్పు దిక్కుగా కదులుతూ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ వైపు వేగంగా వస్తున్నాయి. దీనికి తోడు.. ఆగ్నేయ ఆసియా ప్రాంతం నుండి కూడా మేఘాలు రావడం వల్ల, ఈ రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.

Also Read: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

తెలంగాణలో.. ఏప్రిల్ 12 శనివారం నాడు మహబూబాబాద్, ములుగు,  సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి , భువనగిరి, హైదరాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో వాతావరణం వేడిగా,  పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

Also Read: Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!

అయితే.. రాత్రి సమయానికి వాతావరణం కొంతమేర చల్లబడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో ఏప్రిల్ 12వ తేదీ, శనివారం నాడు వాతావరణం సాధారణంగా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

తీర ప్రాంత జిల్లాలైన విశాఖపట్నం, గుంటూరు , కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అయితే.. మేఘాలు ఆవరించి ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి.. ఎండలో బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.బంగాళాఖాతంలో గాలుల వేగం గంటకు 11 కిలోమీటర్లకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో గంటకు 12 కిలోమీటర్లు మరియు తెలంగాణలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 

ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 40 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. వర్షం లేని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తేమ శాతం రెండు రాష్ట్రాల్లోనూ పగటిపూట 20 శాతం కంటే తక్కువగా ఉంటుందని అధికారులు వివరించారు. రాత్రి సమయంలో తెలంగాణలో తేమ 40 శాతానికి.. ఆంధ్రప్రదేశ్‌లో 75 శాతానికి పెరిగే అవకాశం ఉంది.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

Also Read: Train Tickets: తత్కాల్ టైమింగ్స్ మార్పుపై కేంద్రం క్లారిటీ..

Tags : warangal | nalgonda | suryapet | rains | Telangana Weather | telangana weather report today | telangana weather news | telangana weather updates | telangana-weather-report | telangana-weather-update | imd alert heavy rains to telangana | weather updates | Andhra Pradesh and Telangana Weather Report

Advertisment
Advertisment
Advertisment