Realme 13 Pro Offer: కిర్రాక్ డిస్కౌంట్.. రెడ్ మీ ఫోన్ పై రూ.8వేల తగ్గింపు- వెరీ చీప్!

అమెజాన్‌లో రెడ్‌మి 13ప్రో ఫోన్‌పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB ధర రూ.26,999 ఉండగా ఇప్పుడు రూ.19,999కి లిస్ట్ అయింది. రూ. 1250 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఇది రూ.18,749కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో మరింత తక్కువకే పొందొచ్చు.

New Update
Realme 13 Pro smartphone available on amazon is getting a discount of Rs.8000

Realme 13 Pro smartphone available on amazon is getting a discount of Rs.8000

తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటున్నారా?.. అలాంటి ఫోన్ కోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రూ. 20 వేలలోపు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు Realme 13 Pro మంచి ఆప్షన్. ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్‌పై బ్లాక్ బస్టర్ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్‌లు కూడా పొందొచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆఫర్లు, పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

Realme 13 Pro Price

Realme 13 Pro పై ఆఫర్ లభిస్తుంది. ఇందులోని 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ గతేడాది జూలైలో విడుదలైనపుడు రూ.26,999కి లిస్ట్ అయింది. ఇప్పుడు ఇది అమెజాన్‌లో రూ. 19,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై ఫ్లాట్ రూ. 1250 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర రూ.18,749 అవుతుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.17,400 తగ్గింపును పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్ఛంజ్ ధర నిర్ణయిస్తారు. 

Realme 13 Pro Specifications

Realme 13 Pro ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2412x1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Qualcomm Snapdragon 7S Gen2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా realme UI 5.0 OSలో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, USB టైప్ C పోర్ట్, బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉన్నాయి. అంతేకాకుండా 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో ఈ ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇంకా వెనుక భాగంలో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

(mobile-offers | latest-telugu-news | telugu-news | redmi)

Advertisment
Advertisment
Advertisment