/rtv/media/media_files/2025/04/03/o9YPI9bcHMLGDV4Bi5j3.jpg)
Heavy rains in Hyderabad
అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Moon: చంద్రుడిపై నిర్మాణాలు.. బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ!
రోడ్లపై నీరు నిలిచిన ప్రదేశాల్లో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరాను పునరుద్ధరించాలని చెప్పారు. జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు.
Also Read: Tamilnadu: చెన్నైలో త్వరలో కార్ల్‌మార్క్స్ విగ్రహం.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన
1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) और शाम का अनुमान 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) and Evening Inference of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :03-04-2025 pic.twitter.com/C0iexM6GiU
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) April 3, 2025
పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి ట్రాఫిక్ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించాలని చెప్పారు. పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం, ఇతర అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 100 ప్రాంతాల్లో 90 వరకు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌లో 9.8 సెం.మీ. వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 9.6, డబీర్‌పురాలో 9.45, సరూర్‌నగర్‌లో 9.35, నాంపల్లిలో 9.43, ముషీరాబాద్‌లో 9.43 సెం.మీ వర్షపాతం నమోదయింది.
ఇదిలా ఉండగా.. నేడు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి, రంగారెడ్డి, జనగామ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, దిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామా బాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
Also Read: Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
Also Read: viral News: పోషించలేనప్పుడు పెళ్లెందుకు చేసుకుంటున్నారు..!
nalgonda | adilabad | yadadri | rains | weather | TG weather1 | TG Weather Updates | rain-alert | heavy rain alert in telugu states | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates