Weather Alert: తెలంగాణకు ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు..
ఈ ఏడాది తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రానున్నాయి. గతేడాదితో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.
ఈ ఏడాది తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రానున్నాయి. గతేడాదితో పోలిస్తే నాలుగు నుంచి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.
గడచిన వారం రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈరోజు(మంగళవారం) రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.