Telangana : తెలంగాణలో పెరుగుతున్న ఎండలు..ఆ సమయంలో ఎవరు బయటకు రావద్దని హెచ్చరిక

గడచిన వారం రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈరోజు(మంగళవారం) రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్‌లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

New Update
FotoJet (69)

Rising sun in Telangana.. Warning to not go out at that time

Telangana : గడచిన వారం రోజులుగా తెలంగాణలో ఎండల తీవ్రత గణనీయంగా పెరిగింది. ఈరోజు(మంగళవారం) రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నిజామాబాద్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

 ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ, మధ్యాహ్నం 12 వచ్చేటప్పటికీ అత్యధిక స్థాయికి చేరుతోంది.  ఉదయం, రాత్రి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా కార్మికులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా ఎండల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు చూసిస్తున్నారు.

బయటకు రావొద్దు..మంత్రి సీతక్క

రాష్ర్టంలో ఉష్ణో్గ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నందున ఎండల్లో  ఎవరు బయటకు రావొద్దని  తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె చూసించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకుండా ఉంటే మంచిదని ఆమె తెలిపారు. ఎలాంటి పనులు ఉన్నా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య పూర్తి చేసుకోవాలని సూచించారు. బయటకు రావలసి వస్తే టోపీ, తలపాగా వంటివి తప్పనిసరిగా ధరించాలని సీతక్క దిశానిర్ధేశం చేశారు.

ప్రస్తుతం ఎండలు పెరిగియాని వీటివల్ల ప్రమాదమని.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు. అధికారులు గ్రామాలు, పట్టణాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీ స్థాయిలో తాగునీటి సౌకర్యాలను కల్పించాలని అధికారులకు చూసించారు. అలాగే, ఉపాధి హామీ కార్మికులకు ప్రత్యేక సూచనలు చేశారు. పనిస్థలాల్లో తాగునీటి వసతి ఏర్పాటు తప్పనిసరని తెలిపారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పని చేసే ప్రాంతాల్లో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. 

Advertisment
తాజా కథనాలు