/rtv/media/media_files/2025/04/04/OD6b9hI6rlNmo6SG04rw.jpg)
Hyderabad Local Authorities MLC Elections
హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 110 ఓట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 24 మంది కార్పొరేటర్ల బలం ఉండగా.. 5 మంది ఎక్స్ అఫిషియో మెంబర్లు కూడా ఆ పార్టీకి ఉన్నారు. దీంతో ఆ పార్టీకి మొత్తం 29 ఓట్లు ఉన్నాయి. ఏప్రిల్ 23న ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. కాంగ్రెస్ సపోర్ట్ తో ఎంఐఎం అభ్యర్థి ఇక్కడ సునాయసంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Konda Surekha: మంత్రి పదవి ఊస్ట్?.. సోనియా, ఖర్గేతో కొండా సురేఖ కీలక భేటీ!
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने तेलंगाना में होने वाले स्थानीय प्राधिकरण निर्वाचन क्षेत्र के विधान परिषद के चुनाव हेतु एक नाम पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/Djqf2K07TA
— BJP (@BJP4India) April 4, 2025
ఎంఐఎంకు 49 ఓట్ల బలం..
ఎంఐఎం పార్టీకి ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో ఆ పార్టీకి మొత్తం 49 ఓట్ల బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్లు, బీఆర్ఎస్ కు 25 ఓట్ల బలం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థిని పోటీలోకి దించకుండా కాంగ్రెస్ పార్టీకి సహకరించింది.
ఇది కూడా చదవండి: Ameenpur 3 Children Case: ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
ఇందుకు ప్రతిఫలంగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు కాంగ్రెస్ సహకరించేలా ఇప్పటికే అవగాహన కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. బీజేపీ అభ్యర్థిని పోటీకి దించడంతో ఎన్నిక అనివార్యం కానుంది. అయితే.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగితే తప్పా బీజేపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం లేదు.
(telangana-mlc-elections | telugu-news | telugu breaking news)