నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

కిషన్ రెడ్డి టార్గెట్ గా MLA రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. MLC అభ్యర్థిగా గౌతమ్‌ రావును ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు పోటీగా అంబర్‌పేట్ నుంచి శోభాయాత్ర చేస్తున్నారన్నారు. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు. 

New Update

తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి టార్గెట్ గా ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌ రావును ప్రకటించడంపై రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీకు గులాంగిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్ల అంటూ ఫైర్ అయ్యారు, టేబుల్ తుడిచేవాళ్లకే పెద్ద పోస్టులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు పోటీగా అంబర్‌పేట్ నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు కాదు.. మీ అయ్య ప్రయత్నం చేసినా తన యాత్రకు వచ్చే భక్తులను ఆపలేరన్నారు. 
ఇది కూడా చదవండి: TG MLC Elections: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు

అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి..

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు శాసనసభ పక్ష నేత పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన మహేశ్వరరెడ్డికి బీజేఎల్పీ నేత పదవి ఇవ్వడంతో రాజాసింగ్ అసంతృప్తికి గురయ్యారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత పేరును ప్రకటించడంపై సైతం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు చెప్పకుండా తన ప్రాంతంలో ఎంపీ అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని ఆయన పార్టీ నాయకత్వంపై భగ్గుమన్నారు. దీంతో హైదరాబాద్ ఎంపీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు.
ఇది కూడా చదవండి: HCU: కంచ గచ్చిబౌలీ వివాదం..తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇటీవల బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై సైతం రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్‌గా ఉంటాడంటూ కామెంట్స్ చేశారు. సెంట్రల్ కమిటీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుని డిసైడ్ చేస్తే బాగుంటుందన్నారు. గతంలో ఎవరు అధ్యక్షుడు అయితే వారు గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారని ఆరోపించారు. 

(kishan-reddy | telugu-news | telugu breaking news | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment