YS sharmila: ఆస్తుల వివాదం.. జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు!

కుటుంబ ఆస్తుల వివాదంలో వైఎస్ జగన్ పై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క ఆస్తి కూడా తమ తల్లి విజయమ్మకు ఇవ్వలేదని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగానే కాదు మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు.

New Update

YS sharmila: కుటుంబ ఆస్తుల వివాదంలో వైఎస్ జగన్ పై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క ఆస్తి కూడా తమ తల్లి విజయమ్మకు ఇవ్వలేదని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగానే కాదు మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ విమర్శించారు.

ఆ షేర్లు గిఫ్ట్‌డీడ్‌..

ఈ మేరకు సరస్వతి పవర్‌ షేర్ల ఎంవోయూపై స్వయంగా సంతకం చేసిన జగన్.. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదన్నారు. విజయమ్మకు సరస్వతి పవర్‌ షేర్లను జగన్‌ గిఫ్ట్‌డీడ్‌ కింద ఇచ్చిన ఆయనే.. మళ్లీ మళ్లీ తనకే కావాలంటూ కోర్టుకు వెళ్లారని చెప్పారు. తల్లిపై కేసు వేసిన కొడుకు, మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా చరిత్రలో మిగిలిపోతారంటూ మండిపడ్డారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో లేదో ఆ పార్టీ నేతలే ఆలోచించాలన్నారు. 

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఇక ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై కూడా విమర్శలు గుప్పించారు షర్మిల. గతంలోనే వచ్చి మన మోహన మట్టి కొట్టి పోయారన్నారు.  మోదీ అమరావతికి రావడం ఇదేమి మొదటిసారి కాదు. మళ్లీ వచ్చిన ఒరిగేది ఏమీ లేదు. ఈసారి మళ్లీ వచ్చి సున్నం కొట్టి పోతారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది. ఆంధ్ర ప్రజలు బతుకులు బాగుపడాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆమె అన్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం దేశానికి ఎంత ఉపయోగమో తెలీదు.. రాష్ట్రానికి మాత్రం చాలా ఉపయోగం. నేను పీసీసీ చీప్ గా ఉన్నది అస్తమానం జగన్ ను బీట్ చెయ్యడానికి కాదు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడటానికేనని స్పష్టం చేశారు.

ws: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

అలాగే విభజన హక్కులు సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని అన్నారు. ముఖ్యమైన ప్రత్యేక హోదా, పోలవరం సహా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. 11 ఏళ్ళు గడిచినా కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్కటికూడా అమలు చేయలేదు. ఆంధ్ర ప్రజల్ని మోసం చేసిన మోడీని కేడీ అంటే తప్పేంటి? ఈ హామీలపై చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. ysr హయాంలో పోలవరంకు అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. 10,150 కోట్లతో 190 టీఎంసీ కెపాసిటీతో 45.7 మీటర్ల ఎత్తుతో నిర్మాణం మొదలుపెట్టారు. 45.7 స్టోరేజ్ కెపాసిటీ తో కడితేనే ప్రాజెక్టు రాష్ట్రానికి వరం. ఎత్తు తగ్గిస్తే పోలవరం రాష్ట్రానికి వరం కాదు. ysr ఉనప్పుడు 33 శాతం పనులు పూర్తి చేసారు. తరువాత చంద్రబాబు 15 శాతం పనులు చేసారు. జగన్ సీఎం అయ్యేసరికి 50 శాతం పనులు పూర్తి అయ్యాయి. ysr కు పోలవరం ఎంత ప్రాధాన్యత ఎంతో తెలిసి కూడా జగన్ పట్టించుకోలేదు. జగన్ హయాంలో ప్రాజెక్టు పనులు కేలవం 3 శాతం మాత్రమే చేసారు. ఇప్పుడు కేంద్రం ప్రాజెక్టు 41.15 మీటర్లు ఎత్తుకి తగ్గిస్తుంటే వీళ్ళు ఎవరూ మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఇక పోలవరం ఎత్తు తగ్గించడం ద్వారా కాస్ట్ తగ్గించాలని కేంద్రం చూస్తుంది. 85 వేల నిర్వాసితులను తగ్గించడానికి ఎత్తు తగ్గించేస్తున్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారారు. రాష్ట్రానికి కేంద్రం మోసం చేస్తుంటే వైసీపీ, టీడీపీ, జనసేన ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదు. 41.15 మీటర్ల ఎత్తుకి తగ్గిస్తే పోలవరం కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవుతుంది. 41.15 మీటర్లకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటే 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలరా? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరంపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. చివరగా ప్రత్యేక హోదా గొంతు పిసికి చంపేసినట్టు పోలవరం ప్రాజెక్టును చంపే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

 ys-sharmila | ys-jagan | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్!

ఏపీలో మరో ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండగా మే 13లోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.

New Update
EC

AP by-election EC notification released

BIG BREAKING: ఏపీలో మరో ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదలచేసి మే 9న పోలింగ్ జరగనుంది. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

29 వరకు నామినేషన్ల స్వీకరణ..

ఈ మేరకు ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు. మొత్తంగా మే 13వ తేదీలోపు ఈఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

 

mp | ap | ec | notification | telugu-news | today telugu news

 

 

Advertisment
Advertisment
Advertisment