CM Revanth Reddy: అది మోదీ మెడపై కత్తిలా మారుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

బీసీ కలగణన మొగ్గ దశలోనే అడ్డుకోడానికి కుట్రలు జరుగుతున్నాయని అఖిలభారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పని ఆరోపిస్తున్నాయని ఆయన అన్నారు.

New Update
Chief Minister Revanth Reddy

Chief Minister Revanth Reddy Photograph: (Chief Minister Revanth Reddy )

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీలకు న్యాయం జరగడం ఇష్టం లేని వారి లెక్కలు తప్పని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే.. మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ కులగణన లెక్కలు తప్పని ఆరోపిస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అఖిలభారత పద్మశాలి మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మాట్లాడారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Also read: Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

కెసిఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే... నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమేనని ముఖ్యమంత్రి నెక్కి చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోంది.. ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారని రేవంత్ రెడ్డి కొనియాడారు.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీనే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకునేందుకు తన సొంత ఇంటినే వేదిక చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదని చెప్పారు.

Also read: నడిరోడ్డుపై జర్నలిస్ట్‌ను కాల్చి చంపిన దుండగులు

తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ని ఖతం చేశాడని రేవంత్ ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమేకాదు... దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నామని తెలియజేశారు సీఎం. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే 600 కోట్ల విలువైన 1కోటి 30 లక్షల చీరల ఆర్డర్లు నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నామని ఆయన వివరించారు. కోటి రూపాయలతో షోలాపూర్‌లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Cockroaches in biryani : అక్కడ బిర్యానీ తింటున్నారా..జర జాగ్రత్త

ఫుడ్​ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్​ యాజమాన్యాలు క్లీనింగ్​ విషయంలో మాత్రం  మారడం లేదు. కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింకలతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు.

New Update
Cockroaches in biryani

Cockroaches in biryani

 Cockroaches in biryani :  ఫుడ్​ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్​ యాజమాన్యాలు క్లీనింగ్​ విషయంలో మాత్రం  మారడం లేదు.  కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింకలతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు. తాజాగా హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు లో  ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ కస్టమర్‌ షాకయ్యాడు. విజయ్‌ అనే వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి రైల్ కోచ్ రెస్టారెంట్ కి వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్‌ చేసి  తింటుండగా..రైస్‌ లో బొద్దింకను చూసి కంగుతిన్నాడు. రైల్ కోచ్ రెస్టారెంట్ లోని ఫుడ్​ లో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయి.  

Also Read: MH: నాగ్ పూర్ లో ఉద్రిక్తత..ఔరంగజేబు సమాధి కోసం ఘర్షణ

ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

చూడడానికి రైలులా  ఉండే రైల్​ కోచ్​ రెస్టారెంట్​ కష్టమర్ల.. ఆరోగ్యం విషయంలో  హోటల్​ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది.   నిర్వహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు  వాపోయాడు. బాధితుడు ఫుడ్‌ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

Also Read:  TS: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు!

చూడటానికి వెరైటీగా ఉందని నెక్లస్​ రోడ్​లోని రైల్​ కోచ్​ రెస్టారెంట్​కు వెళ్తే.. ఆస్పత్రిలో బెడ్​ బుక్​ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుదని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  నిర్వహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు  వాపోయాడు. బాధితుడు ఫుడ్‌ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు