/rtv/media/media_files/2025/03/18/lm0qVqoEp4hZP1U9Xrsl.jpg)
Co-Living
Co-Living : కో లివింగ్ వినడానికి కొత్తగా అనిపించినా చాలా కాలంగా ఈ కల్చర్ చాపకింద నీరులా హైదరాబాద్‌లో విస్తరిస్తోంది. పెళ్లి కాకుండానే రిలేషన్ షిప్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే హాస్టల్ లేదా ప్లాట్ తీసుకొని ఉండటాన్ని కో లివింగ్ అంటారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు పూర్తి భిన్నమైన ఈ కల్చర్ ఇపుడు సర్వసాధారణమైంది. ఒకప్పుడు అబ్బాయిలు అబ్బాయిలు, అమ్మాయిలు అమ్మాయిలు మాత్రమే కలిసి ఉండే సంస్కృతి పోయి ఇప్పుడు ఈ కొత్త కల్చర్ రాజ్యమేలుతోంది. నిన్నమొన్నటి దాకా లివింగ్ టు గెదర్ కల్చర్ ఉండేది. ఇందులో ఇద్దరు ప్రేమలో ఉన్నవారు మాత్రమే తమ జోడితో కలిసి ఉండేవారు. అయితే కో లివింగ్ దీనికి పూర్తి భిన్నం.
Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కో లివింగ్ హాస్టళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ముంబాయి, ఢిల్లీ, కోల్కత్తా, బెంగళూరు వంటి రాష్ట్రాల్లో ఈ తరహా లివింగ్ స్టైల్ ఉండేది. క్రమేపీ అది తెలుగు రాష్ట్రాలకు సైతం పాకింది. ప్రస్తుతం అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌళి, కేపీహెచ్‌బీ, రాయదుర్గం వంటి ఏరియాలో ఈ కో లివింగ్ కల్చర్ కాస్త ఎక్కువగా కనబడుతుంది.
Also Read: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
కో లివింగ్ కల్చర్ లో ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు. IT కారిడార్, హైటెక్స్, మాదాపూర్, KPHB తదితర ప్రాంతాల్లో ఇటువంటి PG హాస్టల్స్ వెలిశాయి. పైగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ మరీ ఆకర్షిస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన యువత ఎక్కువగా హాస్టళ్లలోనే ఉంటారు. ఇందులో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే హాస్టళ్లలో ఉండేందుకు మొగ్గుచూపడం విశేషం.సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్‌గా ఎలాంటి తప్పులేదని చెబుతున్నా.. ఈ కో లివింగ్ రిలేషన్స్ ద్వారా దుర్వినియోగం, నేరాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఓకే రూమ్‌లో ఉన్నంత సేపు ఎలాంటి సమస్యలు ఉండవు కానీ.. వారి మధ్య మనస్పర్ధలు వచ్చిన్పపుడు ఇద్దరి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగడం వంటి ఘటనలు సైతం తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలామంది యువత తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి కో లివింగ్ రిలేషన్స్‌లో ఉంటున్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య ఘర్షణలు వచ్చిన సమయంలోనే విషయాలు వెలుగు చూస్తు్న్నాయి. అప్పటి వరకు తమ పిల్లలు ఏదో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారని, ఉద్యోగం చేస్తున్నారని అనుకునేవారికి గుండె పగిలినంత పనవుతుంది. అయితే ఈ కల్చర్ మంచిది కాదన్నది సామాజిక వేత్తల అభిప్రాయం. ఇప్పటికే కో లివింగ్ హాస్టల్స్ హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, సాధారణమైన హాస్టల్స్‌కు ఎలాంటి అనుమతులు, నిబంధనలు ఉంటాయో వీటికి కూడా అవే వర్తిస్తాయని అంటున్నారు న్యాయ నిపుణులు. పిల్లల కదలికలపై పేరెంట్స్ కూడా ఓ కన్నేయాలని సజెస్ట్ చేస్తున్నారు. కో లివింగ్ కల్చర్ ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. కో లివింగ్ కల్చర్‌ను కొందరు సమర్ధిస్తే మరికొందరు మత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.