/rtv/media/media_files/2025/03/18/58t0RLMXLbb0ilV9QxiA.jpg)
dragon ott release
Return Of The Dragon: నటుడు ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే సినిమాతో యూత్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అదే జోష్ లో ఇటీవలే "రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్" అంటూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించాడు. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్నింటిలో సూపర్ సక్సెస్ గా నిలిచింది.
ఓటీటీలోకి డ్రాగన్ ఎంట్రీ
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ 'డ్రాగన్' ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. ప్రజెంట్ జనరేషన్ కి లైఫ్ పై ఒక మంచి మెసేజ్ ఇస్తూ రూపొందిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది.
Some dragons don’t breathe fire, because their comebacks are hotter 😎🧯
— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025
Watch Dragon on Netflix, out 21 March in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam #DragonOnNetflix pic.twitter.com/hFGn9tRTia
AGS ఎంటర్‌టైన్‌మెంట్ (P) Ltd బ్యానర్ పై కేవలం రూ. 35 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ. 150కోట్లు పైగా వసూళ్లను రాబట్టింది.
కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మించారు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!