Danam Nagender: నేనే సీనియర్..ఎవరిమాట వినాల్సిన అవసరం లేదు..దానం హాట్ కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ జీరో అవర్‌లో అధికారుల తీరుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన అప్లయ్.. అప్లయ్ నో రిప్లయ్ అన్నట్లుగా ఇక్కడ నడుస్తోందని అన్నారు.

New Update
Danam Nagender

Danam Nagender

Danam Nagender: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ జీరో అవర్‌లో అధికారుల తీరుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన అప్లయ్.. అప్లయ్ నో రిప్లయ్ అన్నట్లుగా ఇక్కడ నడుస్తోందని అన్నారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలోని ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారని నేను నా రెగ్యులర్ స్టైల్ లో వెళ్లి పగలగొట్టానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే స్థలానికి పక్కన ఉన్న మరికొంత స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం ల్యాండ్ ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేక పోయారు. కానీ ఆ పక్కనే ఉన్న ఈద్గా గ్రౌండ్ లో లోకల్ ఎమ్మెల్యేను నా దృష్టికి తేకుండానే సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారన్నారు. అందుకే నాకు వేరే ఆప్షన్ లేక దాన్ని పగలగొట్టానన్నారు. అలాగే మిడ్ డే మీల్స్ లో విద్యార్థులకు ఎగ్స్ ఇవ్వడం లేదని ఆ పిల్లలకు మనం ఎగ్స్ ఇవ్వాలి కదా అన్నారు.

Also Read: Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల్లో బ్లాస్టింగ్.. ఒకరు మృతి!

 అధికారుల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇస్తా.. నాకు సమాచారం ఇవ్వకుండా సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.. అధికారులు, అధికారులు మాట్లాడుకుని కాంప్రమైజ్ అవుతున్నారు.. ఎమ్మెల్యేలు చెప్పినా వినడం లేదు. నేను కూడా మంత్రిగా పని చేశా. నాకు తెలుసు ఏం మాట్లాడాలో అని దానం అన్నారు. అలాగే స్కూల్ పిల్లకు మిడ్ డే మీల్స్ లో ఎగ్స్ అందించడం, ఆర్ఓఆర్ ప్లాంట్స్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వీటిపై మంత్రులు నోట్ చేసుకున్నామంటరు ఆ తర్వాత తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేస్తరు. ఇది నేను చేశాను కాబట్టి చెప్తున్నానని అన్నారు. ఎవ్వరినీ బ్లేమ్ చేయడం లేదని దానం తెలిపారు.

Also Read: Telangana: మందుబాబులకు అదిరిపోయే వార్త... మార్కెట్లోకి ఏకంగా 37 కొత్త బ్రాండ్లు..!

నా నియోజకవర్గం పరిధిలోని అంశాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నోట్ చేసుకుంటామని చెప్పడం కాదన్నారు. నాకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఏం మాట్లాడాలో.. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేను నేను అంటూ కామెంట్స్ చేశారు. నూతన భవనాల నిర్మాణాల విషయంలో సోషల్ మీడియాలో చిన్నచిన్న పత్రికలతో బ్లాక్ మెయిల్ లో చేస్తున్నారు. వీరికి జీహెచ్ఎంసీ అధికారులు వణికిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసినా స్పందించరు కానీ సోషల్ మీడియా పర్సన్స్ ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారని అన్నారు. ఆ తర్వాత అధికారులు వారు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు.

Also Read: Israel: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..200 మంది మృతి

Also Read: Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు