/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/dk-aruna-jpg.webp)
MP DK Aruna
బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన అక్రమ్‌గా గుర్తించారు. అతడిని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఎంపీ ఇంట్లోకి చొరబడేందుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. అక్రమ్ గతంలో హైదరాబాద్‌లోని పాతబస్తీ, దిల్లీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఎంపీ ఇంటికి చేరుకుని వివరాలను సేకరించిన విషయం తెలిసిందే. కాగా డీకే అరుణ ఇంట్లోకి అగంతకుడు చొరబడిన విషయాన్ని సీఎం రేవంత్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెకు కాల్ చేసిన రేవంత్ విషయాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో నిందితుడిని వీలయినంత త్వరగా పట్టుకోవాలన పోలీసులను ఆదేశించారు. దీంతో నగరాన్ని జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితున్ని పట్టుకున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
Arrest Of Intruder Who Broke Into DK Aruna's House
కాగా, జూబ్లీహిల్స్ లోని ఎంపీ డీకే అరుణ నివాసంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 56లోని ఎంపీ నివాసంలోకి నిందితుడు ముసుగు ధరించి ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు.దుండగుడు ముసుగు, గ్లౌజులు ధరించి ఏకంగా ఇంట్లోకి చొరబడ్డాడు. నిందితుడు ముసుగు ధరించి ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, సుమారు గంట పాటు ఇంట్లో తిరిగి అక్కడి నుంచి జారుకొన్నాడు. అరుణ కుమార్తె ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంట గది కిటికీ గ్రిల్ తొలగించడం గమనించారు.గమనించిన ఇంట్లోని సిబ్బంది భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణదృష్టికి తీసుకెళ్లారు. అ దీనిపై ఎంపీ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు.
Also Read: AP: వేగంగా ఏపీలో అభివృద్ధి.. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో లులూ మాల్స్
ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేరుగా డీకే అరుణకు ఫోన్ చేసి మాట్లాడారు. అదేవిధంగా తన అనుమానాలకు ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందని తనకు వెంటనే భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వెంటనే భద్రత పెంచాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read : ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!