/rtv/media/media_files/2025/01/08/C36mDZo8PRvjrmv6GEv2.jpg)
Telangana High Court
Telangana High Court: ఓ పిటిషనర్ విషయంలో ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు ఏకంగా రూ. 1కోటి జరిమానా విధించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పును వెలువరించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచిపెట్టి వేరే బెంచ్ వద్ద పిటిషన్లు దాఖలు చేయడంపట్ల న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ భూముల కబ్జా యత్నాలను హైకోర్టు అడ్డుకున్నది. కాగా ప్రభుత్వ భూముల విషయంలో హైకోర్టు లో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచి పెట్టి వేరే బెంచ్‌ను పిటిషనర్లు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టును తప్పుదోవ పట్టించేలా.. వారి సమయం వృథా చేసేలా మరో బెంచ్‌లో తిరిగి పిటిషన్లు వేయడం పై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ భూములు కాజేయాలని తప్పుడు రిట్ పిటిషన్లు వేసిన పిటిషనర్లకు రూ.కోటి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.
Also Read: sunita williams: ఇండియన్స్‌తో సునీతా విలియమ్స్ రేర్ ఫొటోలు.. చూశారంటే నిజమేనా అనడం పక్కా!
ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారంటూ మండిపడ్డారు. ఇలా రిట్ పిటీషన్ వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు విచారణలో పెండింగ్ లో ఉన్న సమయంలో మరొక చోట ఎందుకు పిటీషన్ వేశారంటూ తీవ్ర స్థాయిలో మందలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కేసులో పిటీషనర్ కు భారీ జరిమానా విధిస్తూ ఈనిర్ణయం తీసుకోవడం తెలంగాణ హైకోర్టులో సంచనంగా మారింది.
Also Read: ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!