/rtv/media/media_files/2025/03/18/m7Wn6TzTRNiaczgALiwB.jpg)
Broken Mirror Photograph: (Broken Mirror)
ప్రతీ ఒక్కరి ఇంట్లో అద్దం ఉంటుంది. అనుకోకుండా కొన్నిసార్లు ఈ అద్దం విరిగిపోతుంది. ఇలా అయితే కొందరు ఆ అద్దాలను పడేస్తే.. మరికొందరు విరిగిన అద్దంలోనే ముఖం చూస్తుంటారు. వీటిలో ఎప్పుడూ కూడా ముఖాలు చూసుకోకూడదు. అసలు ఇంట్లో పగిలిన అద్దం ఉంటే ఇంట్లో కష్టాలు తప్పవు. అద్దాన్ని లక్ష్మీ దేవితో పోలుస్తారు.
ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
లక్ష్మీదేవితో పోలుస్తూ..
అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ఉన్న సంపద అంతా కూడా పోతుందని, ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండదని, ఏదో ఒక సమస్య వస్తుందని పండితులు అంటున్నారు. అద్దంలో బొమ్మ నిలకడగా ఉండదు. అంటే లక్ష్మీదేవి ఒకే దగ్గర ఉండిపోదు. ఇలా అద్దం ముక్కలైతే మీ లక్ష్మీదేవి అంతా కూడా ముక్క ముక్కలుగా పోతుందని నమ్ముతారు. కాబట్టి విరిగిన అద్దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. వీటివల్ల మీకు కష్టాలే తప్పా సుఖాలు ఉండవు.
ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
కొందరు ఇంటికి ఎదురుగా అద్దం పెడతారు. ఇలా పెట్టడం వల్ల ఇంటికి వచ్చే శక్తులు అన్ని కూడా వెనక్కి వెళ్లిపోతాయి. అద్దాన్ని దైవంతో పూజిస్తారు. అందుకే నెలసరి సమయంలో అసలు అద్దాన్ని వాడేవారు కాదు. పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే మనం కూడా మరణిస్తామని చెబుతుంటారు. అందుకే పగిలిన అద్దం చూడకుండా వెంటనే పడేయాలని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!