Sunita Williams Return Live Updates: సునీతా విలియమ్స్ ల్యాండింగ్.. లైవ్ అప్డేట్స్!

author-image
By Nikhil
New Update
Sunita Williams Return Live Updates

Sunita Williams Return Live Updates

  • Mar 18, 2025 13:25 IST

    ఇండియన్స్‌తో సునీతా విలియమ్స్ రేర్ ఫొటోలు.. చూశారంటే నిజమేనా అనడం పక్కా!

    భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ రేపు భూమి మీదకు రానున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన రేర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో సోనియా గాంధీ, వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా, నంబి నారాయణన్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

    sunita williams01



  • Mar 18, 2025 13:23 IST

    సునీతా సేఫ్ ల్యాండింగ్ కు షాకింగ్ సవాళ్లు.. కల్పనా చావ్లాకు ఏం జరిగిందో తెలుసా?

    తొమ్మిది నెలల తర్వాత ఐఎన్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగి వస్తున్నారు. యావత్ ప్రపంచం ఆ ఆస్ట్రోనాట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సునీతా, మిగతా వారు ఎదుర్కునే సవాళ్ళు ఏంటి? వారు భూమి మీదకు సురక్షితంగా రాగలరా..

    Sunita Williams



  • Mar 18, 2025 13:21 IST

    Sky To Earth ..సునీత విలియమ్స్ రిటర్న్స్

    భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో భూమిమీదకు చేరుకోనున్నారు. మంగళవారం ఉదయం అంతరిక్ష నౌక ‘డ్రాగన్’ అన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం ‘డ్రాగన్’ భూమికి ప్రయాణమవుతుంది. బుధవారం ఫ్లోరిడాలో ల్యాండ్ అవుతుంది.

    Sunita Williams
    Sunita Williams

     



  • Mar 18, 2025 13:20 IST

    సునీతా విలియమ్స్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె భారతీయ మూలాలు ఎక్కడంటే?

    నాసా ఆస్ట్రానాట్ సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యాది గుజరాత్‌. ఆయన అమెరికాలో న్యూరో అనాటమిస్ట్‌గా సెట్టిలై ఉర్సులిన్ బోనీ పెళ్లి చేసుకున్నారు. వారు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. సునీతా ఫెడరల్ పోలీస్ ఆఫీసర్‌ మైఖేల్ జె. విలియమ్స్‌ను పెళ్లి చేసుకుంది.

    sunita williams 123
    sunita williams 123 Photograph: (sunita williams 123)

     



  • Mar 18, 2025 13:19 IST

    భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబ్లల్స్

    సునీతా విలియమ్స్, విల్మోర్లు భూమి మీదకు రాగానే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. 9 నెలలుగా తక్కువ గురుత్వాకర్షణకు అలవాటు పడిన వారి కండరాలు, ఎముకల కదలికలలో సమస్యలు వస్తాయి. బాడీ బ్యాలెన్స్, హార్ట్ బీట్‌ నార్మల్ అవ్వడానికి ట్రీట్‌మెంట్, వ్యాయామం అవసరం.

    sunita williams and butch wilmore
    sunita williams and butch wilmore

     



  • Mar 18, 2025 13:18 IST

    భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్‌.. టైమ్‌ చెప్పిన నాసా

    భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌ భూమి మీదకు రానున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు.

    sunita williams and butch wilmore
    sunita williams and butch wilmore

     



  • Mar 18, 2025 13:15 IST

    భూమిపైకి వచ్చాక సునీతా విలియమ్స్‌కు ఎదురుకానున్న ఇబ్బందులు

    సునీతా విలయమ్స్, బుచ్‌ విల్మోర్‌ మార్చి 19న అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి రానున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చాక పలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఒక పెన్సిల్‌ లేపినా కూడా వర్కౌట్‌ చేసినట్లే ఉంటుందని స్వయంగా బుచ్‌ విల్మోర్ చెప్పారు.



  • Mar 18, 2025 12:34 IST

    మార్చి 19 ఉదయం 05.00 గంటలకు – భూమికి తిరిగి రావడం గురించి విలేకరుల సమావేశం.



  • Mar 18, 2025 12:33 IST

    మార్చి 19 ఉదయం 03.27 – స్ప్లాష్‌డౌన్ (సముద్రంలో అంతరిక్ష నౌక ల్యాండింగ్)



  • Mar 18, 2025 12:33 IST

    19 మార్చి 02.41 am – డియోర్బిట్ దహనం (వాతావరణంలోకి అంతరిక్ష నౌక ప్రవేశం)



  • Mar 18, 2025 12:33 IST

    మార్చి 18న ఉదయం 10.35 గంటలకు - అన్‌డాకింగ్ (ISS నుండి అంతరిక్ష నౌకను వేరు చేయడం)



  • Mar 18, 2025 12:33 IST

    సునీత విలియమ్స్ రాక.. ఎప్పుడు ఏం జరగనుంది?

    • 18 మార్చి 08.15 ఉదయం – హాచ్ క్లోజ్



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు