/rtv/media/media_files/2025/03/18/fq0Eeg5FS9zpcLfJz5X3.jpg)
Atrocities uncovered
వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపి (Prostitution) లోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న కీలక నిందితురాలు ముస్కు లతను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటు చేసేందుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ (Instagram Account) సహాయంతో ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసిన యువతి తన లవర్ తో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు చేసింది. అంతే కాకుండా మైనర్ బాలికను నర్సంపేట తీసుకెళ్ళి గంజాయి తాగించి అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. మార్చి 11న జరిగిన ఈ పాశవిక ఘటనను సీరియస్ గా తీసుకున్న వరంగల్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. మార్చి 11వ తేదీ వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మిస్సింగ్ కి సంబంధించి ఫిర్యాదు రాగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
Also Read : మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండండి!
Atrocities Uncovered In Warangal
దర్యాప్తు చేసిన పోలీసులు కిడ్నాప్ కు గురైన మైనర్ బాలిక (Minor Girl) ని ములుగు క్రాస్ దగ్గర గుర్తించారు.తదుపరి బాలికని విచారించగా తనను కొంతమంది కిడ్నాప్ చేసి గంజాయి తాగించి ఆపైన అత్యాచారం చేసారని తెలిపింది. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందుతుల కోసం గాలించారు.ఈ క్రమంలో దామెర మండలానికి చెందిన పడుపు వృత్తి చేసే మస్కు లతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లతతో పాటు తన దగ్గర ఉన్న మరో మైనర్ నిందితురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
మైనర్ నిందితురాలు సాయంతో లత బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. బాధిత బాలికతో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తెలిపింది. ఈ కిడ్నాప్ ప్లాన్ లో మైనర్ నిందితురాలి లవర్ హస్తం కూడా ఉందని గుర్తించారు పోలీసులు. మైనర్ నిందితురాలు లవర్ అబ్దుల్ అప్నాన్ సాయంతో మైనర్ బాలికకు మందు, గంజాయి అలవాటు చేసి తమ ట్రాప్ లో పడేలా చేశారని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసే సమయంలో వీడియో రికార్డ్ చేసారని..ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే.. వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు తెలిపింది బాలిక. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటు అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ లను అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందుతురాలు ముస్కు లత ఇంటి వద్ద 4300 కండోమ్ పాకెట్స్ తో పాటు రూ. 7వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఒక బ్రేజా కారు, 4 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Also Read : పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్