/rtv/media/media_files/2025/03/18/0AIElLDzP8uxNyixb4Go.jpg)
Woman Murder :
Woman Murder : అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
అయితే బెడ్ షీట్ అనుమానాస్పదంగా కనిపించడం, రక్తంతో ఉండటంతో స్థానికంగా దాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బెడ్ షీట్ ను ఓపెన్ చేసి చూడగా ఓ మహిళకు చెందిన రెండు కాళ్లు, రెండు చేతులు అందులో ఉండటం చూసి షాక్ అయ్యారు. దాంతో స్థానికంగా కలకలం రేగింది. అసలు హత్యకు గురైంది ఎవరు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు?, హత్య చేయడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
అనకాపల్లి జిల్లా పోలీసు అధికారులు సీసీ కెమెరా ఆధారంగా, అలాగే వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల పరిశీలన ద్వారా కేసు దర్యాప్తు చేస్తామని కశింకోట సీఐ స్వామి నాయుడు తెలిపారు. జాతీయ రహదారి అందులో కల్వర్ట్ పక్కనే వాహనంలో వచ్చి పడేసి ఉంటారని అనుమానంతో కేసు దర్యాప్తు సాగుతోంది. బయ్యవరం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. మహిళ దారుణ హత్య ఘటన పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే విచారణ చేసి, నిందితులను అరెస్ట్ చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
Also Read: Israel: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి