/rtv/media/media_files/2025/04/04/HHpikVmzFer3vNIH9QLM.jpg)
waqf board land in india Photograph: (waqf board land in india)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. భారతదేశంలోని వక్ఫ్ బోర్డులు సమిష్టిగా 39 లక్షల ఎకరాలను కలిగి ఉన్నాయని చెప్పారు. ఇది దేశం మొత్తం భూభాగంలో దాదాపు 5 శాతమని ఆయన అన్నారు. ఇండియాలో అత్యధికంగా వక్ఫ్ బోర్డులకే భూములు ఉన్నాయని, వాటి హక్కులను కొందరు మాత్రమే అనుభవిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రక్షణ దళాలకు 17 లక్షల ఎకరాలు ఉండగా.. 12 లక్షల ఎకరాలు రైల్వే భూములు ఉన్నాయని హోం మంత్రి బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించారు. వక్ఫ్ బోర్డుల క్రింద మాత్రం 39 లక్షల ఎకరాలు ఉన్నాయని లెక్కలు చెప్పారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా ఇచ్చిన ఆస్తులను వక్ఫ్ అంటారు.
Also read: Congress MLA CPR: కాంగ్రెస్ కార్యకర్తకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే (VIDEO)
ఒకసారి దానం చేసిన తర్వాత, ఆస్తి యాజమాన్యాన్ని అల్లాహ్ బదిలీ చేసి, తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆస్తులు లేదా భూమిని అమ్మలేము. భారతదేశంలో వక్ఫ్ చరిత్ర 12వ శతాబ్దంలో నుంచి ప్రారంభమైంది. ముహమ్మద్ ఘోరీ భారత్‌పై దండయాత్ర అనంతరం ముల్తాన్‌లో 2 గ్రామాలను అల్లాహా( వక్ఫ్)కు బహుమతిగా ఇచ్చాడు. ఈ చట్టానికి సవరణ చేస్తూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది లోక్, రాజ్య సభల్లో అమోదం కూడా పొందింది. వక్ఫ్ బోర్డుల ఆస్తుల యాజమాన్యంలో పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ లక్ష్యంగా దీన్ని కేంద్ర తయారు చేసింది. ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా మార్చడంపై కూడా ఈ బిల్లు కొన్ని నియంత్రణలను విధిస్తుంది.
𝗜𝘀 𝗢𝘂𝗿 𝗚𝗼𝘃𝘁 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮 𝗲𝘅𝗽𝗲𝗰𝘁𝗶𝗻𝗴 𝘀𝗼𝗺𝗲 𝗺𝘂𝗹𝗹𝗮𝗵 𝘁𝗼 𝗱𝗲𝗰𝗹𝗮𝗿𝗲 𝗵𝗮𝗹𝗳 𝗼𝗳 𝗜𝗻𝗱𝗶𝗮 𝗮𝘀 𝘄𝗮𝗾𝗳 𝗽𝗿𝗼𝗽𝗲𝗿𝘁𝘆 𝗯𝗲𝗳𝗼𝗿𝗲 𝗶𝘁 𝗰𝗼𝗻𝘀𝗶𝗱𝗲𝗿𝘀 𝗔𝗯𝗼𝗹𝗶𝘀𝗵𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗪𝗮𝗾𝗳 𝗟𝗮𝘄?
— 𝗔𝗵𝗮𝗺 𝗕𝗿𝗮𝗵𝗺𝗮𝘀𝗺𝗶 (@TheRudra1008) March 24, 2025
You will be shocked if you check this data… pic.twitter.com/YmPkT05oUi
Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?
1913 నుంచి 2013 వరకు వక్ఫ్ బోర్డుకు మొత్తం18 లక్షల ఎకరాల భూమి ఉంది. 2013లో 1995 వక్ఫ్ చట్టాన్ని యుపిఎ II ప్రభుత్వం సవరించింది. 2013, 2025 మధ్యకాలంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ ఆస్తులు మరో 21 లక్షల ఎకరాలకు పెరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రస్తుతం మొత్తం 39 లక్షల ఎకరాల ఆస్తులు మతం పేరు మీద వాటిని అనుభవిస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్‌గా తాకట్టు పెట్టిన అన్ని ఆస్తులకు అల్లాహ్ అంతిమ యజమాని అయినప్పటికీ, వాటిని భౌతికంగా ఒక ముతవల్లి నిర్వహిస్తారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను నిర్వహిస్తాయి. భారతదేశంలో 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, కోల్‌కత్తా, ముంబై లాంటి మెట్రో నగరాల్లో కూడా వక్ఫ్ బోర్డులకు భారీగా భూములున్నాయి.
ఢిల్లీలో 3లక్షల 60 వేల ఎకరాలు, హైదరాబాద్‌లో లక్షా 70 వేల ఎకరాలు, బెంగుళూర్‌లో 2 లక్షల 20 వేల ఎకరాలు భూమి వక్ఫ్ బోర్డుల పేరు మీద ఉంది.