/rtv/media/media_files/2025/04/12/rFjrKWvwkDPkBubkbPKW.jpg)
Tokay Gecko lizard
Tokay Gecko : అసోంలోని దిబ్రూగఢ్ లో అక్రమంగా తరలిస్తున్న 11 అరుదైన బల్లులను ప్రత్యేక దర్యాప్తు బృందం సీజ్ చేసింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారంతో ఐదు రోజుల నుంచి నిందితులపై నిఘా ఉంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం....బల్లులను అమ్మేందుకు ఓ రెస్టారెంట్ లో ఒప్పందం కుదుర్చుకుంటుండగా వారిని అరెస్టు చేసింది. స్మగ్లింగ్ ఆపరేషన్ కు ఉపయోగించిన వాహనం సహా ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి నిందితులు బల్లులను సేకరించారని డీఎస్పీ సత్యేంద్ర సింగ్ తెలిపారు. సీజ్ చేసిన బల్లులు విలువ అంతర్జాతీయ మార్కెట్ లో కోటి రూపాయలు వరకు ఉంటుందని వెల్లడించారు. వన్యప్రాణాల అక్రమ రవాణా వెనక పెద్ద నెట్ వర్క్ ఉందని తెలిపిన ఆయన...వాటిని ఛేదించేందుకు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
Also Read : గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి ఆల్‌రౌండర్ ఔట్!
కాగా ఈ కేసును చేధించిన విధానాన్ని డీఎస్పీ మీడియాకు వెళ్లడించారు. దక్షిణాసియాలోని వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ నుంచి అస్సాం అటవీ శాఖ అధికారులకు టోకే గెక్కో బల్లుల అక్రమ రవాణా గురించి సమాచారం అందింది. దీంతో వెంటనే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం చిక్కిన బల్లులు లక్షలు విలువ చేసే అత్యంత అరుదైన జాతి బల్లులని ఆయన వివరించారు. వాటిని టోకే గెక్కో అని పిలుస్తారని, ఆ జాతికి చెందిన ఒక్క బల్లిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే లక్షల్లో డబ్బు చెల్లిస్తారని వెల్లడించారు.
Also Read : వీరు పొరపాటున పాలు తాగారో.. పైకి పోవడం ఖాయం
టోకే గెక్కో బల్లుల అక్రమ రవాణా గురించి సమాచారం అందగానే వేటగాళ్ల మీదా నిఘా ఉంచినట్లు తెలిపారు. దిబ్రూఘర్ జిల్లా పోలీసుల సహకారంతో స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే టోకే గెక్కో బల్లులు అమ్మేందుకు కొందరు మోహన్‌బరి ప్రాంతానికి వస్తున్నారనే పక్కా సమాచారం వారికి అందింది. ఈ మేరకు మోహన్‌బరి టినియాలిలోని సన్ ఫీస్ట్ దాబా వద్దకు సిట్ బృందం ముందుగానే చేరుకుంది. ఆ దాబా వద్దకు కారులో ఇద్దరు రాగా.. మరో వ్యక్తి బైక్‌పై వచ్చాడు. చర్చల అనంతరం బల్లులు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి అత్యంత అరుదైన 11 టోకే గెక్కో బల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బల్లిని రూ.60లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిసి షాకవ్వడం పోలీసుల వంతయింది.
Also Read : మాస్ మహారాజ్ 'మాస్ జాతర' షురూ.. మనదే ఇదంతా.!
కాగా బల్లులను విక్రయించేందుకు యత్నించిన దేబాషిస్ దోహుటియా(34), మనష్ దోహుటియా(28), దీపాంకర్ ఘర్ఫాలియా(40)ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు వాటిని అరుణాచల్ ప్రదేశ్ నుంచి తీసుకువచ్చారని తెలిపారు. అలాగే ఒక్కొక్కటి రూ.60 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం టోకే గెక్కోలు అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చినట్లు తెలిపారు. వాటిని ఎగుమతి, దిగుమతి వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read : 'జైలర్ 2' లోకి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎంట్రీ..!
₹60 lakhs + for a lizard? Not on our watch.
— Assam Police (@assampolice) April 11, 2025
Acting on intel from @WJCommission South Asia, @STFAssam & @dibrugarhpolice rescued 11 Tokay Geckos from traffickers, 3 persons have been arrested & vehicles seized.
The Geckos will be released back into the wild. pic.twitter.com/6L6bcWLLGK