Telangana: కేంద్ర వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ వక్ఫ్‌బోర్డు..
కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టసవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వ్యతిరేకించింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు అభిప్రాయపడింది.