/rtv/media/media_files/2025/04/13/fSXu9jWxbfUiJ8daVsbO.jpg)
Waqf Amendement Bill
Waqf Amendement Bill : ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ముస్లింలు, ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ మీదుగా కొనసాగింది. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వక్ఫ్ చట్టంతో వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి, వక్ఫ్ ఆస్తులను హిందూ సంఘాలకు కట్టబెట్టడానికి మోడీ కుట్ర చేస్తున్నారని పలు ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!
ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు చట్టాన్ని తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు ఆరోపించారు. వక్స్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు దశల వారిగా నిరసన చేపడతామని వారు హెచ్చరించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని తెలిపింది. సవరణలను పూర్తిగా రద్దు చేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దేశంలోని ముస్లిం సమాజం ఎలాంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై తమతో కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. వెంటనే ఈ బిల్లును విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో జరుగుతున్న నిరసనలు హింసాకాండకు దారితీయగా... కేంద్ర బలగాలతో పరిస్థితులను అదుపు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?