/rtv/media/media_files/2025/04/12/61byMcwqZKvRdV6TaO9i.jpg)
West Bengal
వక్ఫ్ సవరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం నుంచి నిరసనలు జరుగుతున్నాయి. శనివారం రోజున మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు 110 మందికి పైగా నిరసనాకారులను అరెస్టు చేశారు.
Also Read: ఛత్తీస్‌ఘఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న కాల్పులు
Murshidabad For Violence Over WAQF Act
ముర్షిదాబాద్ జిల్లాలో నిషేధాజ్ఞలు విధించామని, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశామని అధికారులు చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఘర్షణ జరిగిన సమయంలో ఆందోళనకారులపై జరిగిన కాల్పుల్లో 10 మంది పోలీసులు, ఓ యువకుడు గాయపడ్డారు. దీంతో వాళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: సూట్ కేసులో లవర్‌ను దాచి.. హాస్టల్ రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు స్కెచ్.. భలే దొరకాడుగా!
మంగళవారం వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయమని సీఎం మమతా బెనర్జీ ఇటీవలే తేల్చిచెప్పారు. మైనార్టీలను, వాళ్ల ఆస్తులను రక్షిస్తానని హామీ ఇచ్చారు. ఒకప్పుడు పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్ కలిసే ఉండేవని.. ఆ తర్వాతే విభజన జరిగినట్లు గుర్తుచేశారు. ఇక్కడే ఉండిపోయిన మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.
Also Read: తత్కాల్ టికెట్ టైమింగ్స్ మార్పు నిజమేనా? క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ
Also Read: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు
waqf-amendment-bill | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu | parliament | west bengal news | waqf-act