/rtv/media/media_files/2025/04/04/PcX3sh0jsY9SlIl6pS12.jpg)
Waqf Amendment Bill
పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుపై తాజాగా కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ బిల్లుపై రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సవాల్ చేశారు. ఇందులో ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించేలా ఉన్నాయని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులు, అలాగే వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని ఆరోపించారు.
Also Read: గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
ఇది ముస్లిం సమాజ స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని చెప్పారు. కోర్టు దీనిపై విచారణ చేయాల్సి ఉంది. ఇదిలాఉండగా ఈ వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లోని పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేశారు. శుక్రవారం ప్రార్థనలు చేసిన అనంతరం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. మరోవైపు తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
Also Read: కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం!
చెన్నై, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల్లో టీవీకే కార్యకర్తలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేక ఆందోళనలు చేశారు. మరోవైపు శాంతి భద్రతలకు వాటిల్లకుండా చూసేందుకు ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పారమిలటరీ బలగాలతో కలిసి శుక్రవారం జామియానగర్, జామియా మిలియా ఇస్లామియాతో పాటు నగరంలోని పలు సున్నితమైన ఏరియాల్లో కవాతు నిర్వహించారు. మొత్తానికి ఈ బిల్లును రద్దు చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కొత్త చట్టం వల్ల వక్ఫ్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోతాయని దీనివల్ల భూ ఆక్రమణలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని ముస్లిం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బినామీల ద్వారా వక్ఫ్ భూములు కబ్జా చేసేందుకు ఇది ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
rtv-news | Waqf Board Bill | waqf-amendment-bill | national-news | bjp