/rtv/media/media_files/2025/04/13/P1Zb8WJL8RZhGvnyqPmJ.jpg)
TVK Chief Vijay
క్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ముస్లింలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు మరికొందరు పిటిషన్ వేసిన సంగతి తెలసిందే. తాజాగా విజయ్ కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
ఇదిలాఉండగా.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై ఇప్పటిదాకా 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు జాబితా కావాల్సి ఉంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌తో కూడిన బెంచ్ విచారణ చేయనుంది.
Also Read: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?
ముందుగా ఏప్రిల్ 15న విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం చెప్పగా.. కేంద్రం గత మంగళవారం కేవియట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని తెలిపింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన పిటిషన్లను ఏప్రిల్ 16న విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సమ్మతితో ఈ చట్టం అమల్లోకి కూడా వచ్చింది.
Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ
rtv-news | waqf-amendment-bill | national-news | telugu-news