/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/court-2.jpg)
2010లో వార్ధాలో ఒక మహిళ పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఏడాది జూన్ 24న బాధితురాలు ఆరోగ్యం బాలేదని ఆసుపత్రికి వెళ్ళింది. ఆ సమయంలో ఆసుపత్రి మూసి ఉండడంతో తిరిగి ఇంటికి వచ్చేందుకు ఆటో కోసం ఒక స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. ఇంతలో ఒక ఆటో వచ్చింది. అందులో అప్పటికే నలుగురు ఉన్నారు. అయినా కూడా బాధితురాలిని ఆటోలో ఎక్కించుకున్నారు. తరువాత ఆమెను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళారు. అక్కడ వారందరూ కలిసి ఆమెపై విడతల వారీగా అత్యాచారం చేశారు. ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నిందితులు తనను బస్టాప్ లో దించారని బాధితురాలు చెప్పింది. ఇంటికి చేరిన తర్వాత బాధితురాలు విషయాన్ని తల్లికి తెలిపింది. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
పదేళ్ల తర్వాత తీర్పు..
అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. పోలీసులు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారు పదేళ్ళుగా జైల్లోనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మందీ నిర్దోషులని ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన సాక్షలుగా ఉన్న బాధిత మహిళ, ఆమె తల్లి ప్రాసిక్యూషన్ వాదనలకు మద్దతు ఇవ్వలేదని కోర్టు చెప్పింది. మొదటగా మొదటి నిందితుడిని కేసులో మహిళ ఇరికించిందని, ఆ తర్వాత తానే పోలీసుల ఒత్తిడితో వాగ్మూలం ఇచ్చినట్లు చెప్పిందని కోర్టు తెలిపింది. నమ్మలేని వాదనలతో శిక్షలను విధించలేమని చెప్పింది. నిందితుల ప్రమేయాన్ని నిర్ధారించడానికి ప్రాసిక్యూషన్ ఎక్కువగా డీఎన్ఏపైనే ఆధారపడింది. అయితే అందులో కూడా సరైన ఆధారాలు లభించలేదు. సాక్షులను పిలవడంలో కూడా విఫలమయింది.
దీంతో కేవలం బాధితురాలి వాంగ్మూలం ఆధారంగానే కేసు అంతా నడిచింది. అందులో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో బాధితురాలు తాను అంతకు ముందు చెప్పిన వాటిల్లో తరువాత తానే కొన్నింటిని తిరస్కరించింది. దీంతో సాక్షి సాక్ష్యంతో కొంత భాగం ప్రాసిక్యూషన్ కేసుతో సరిపోలినప్పటికీ, నేరాన్ని నిర్ణయించడంలో సాక్షి మొత్తం విశ్వసనీయత చాలా కీలకమని జస్టిస్ సనప్ హైలెట్ చేశారు. లోపభూయిష్ట దర్యాప్తులు లేదా బలవంతపు సాక్ష్యాల ఆధారంగా తప్పుడు శిక్షలు పడకుండా కోర్టులు నిర్ధారించుకోవాలని సూచించారు. అందుకే ఎనిమిది మందినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని కోర్టు ప్రకటించింది.