/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
Rains
ఉపరితల ఆవర్తనం వల్ల మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీ వరకు గాలులు ఉండవచ్చని తెలిపింది.
ఇది కూడా చూడండి: AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…
☀️Persistent westerly wind to bring scorching heat to Rayalaseema and TN/AP border districts. 40-42°c likely in these districts today. Weak convergence seen building from afternoon over South Coastal AP. Thunderstorms possible close to Tada, Nellore, Kavali and Tirupathi. pic.twitter.com/8gIt5SyX8Z
— Parthan IN Weather (@PIW44) April 12, 2025
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహూబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
ఇదిలా ఉండగా.. ఏపీలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాలులు కూడా తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
AP Weather Alert | telangana-weather-update | imd alert | latest telangana news | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | heavy-rains