/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
mirlayaguda crime
మిర్యాలగూడ పట్టణంలో తల్లీకూతుళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు పల్నాడు జిల్లా గన్నవరంకు చెందిన తల్లి రాజేశ్వరి, కూతురు సాయివేదశ్రీగా గుర్తించారు.. రాజేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆమె కుమార్తె సాయివేదశ్రీ గొంతు కోసిన గాయాలతో మృతి చెందినట్టు తెలిసింది.
Also Read : అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ..పూజారి పై దాడి!
Also Read : పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా?
తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కూతురిని హత్య చేసి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఒత్తిడితో కుటుంబం ఈ అఘాయిత్యానికి పాలుపడ్డారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుల మానసిక ఆరోగ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు గల అసలు కారణాలు త్వరలో వెలుగులోకి రావొచ్చని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
ఇది కూడా చదవండి: బియ్యాన్ని వంటకే కాదు.. ఇలా కూడా ఉపయోగించవచ్చు
Also Read : నల్గొండలో విషాదం.. తల్లీకూతుళ్లు అనుమానాస్పద మృతి
latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana news live updates | breaking news in telugu | telangana crime case | telangana crime incident | telangana crime news | telangana-crime-updates