/rtv/media/media_files/2024/12/29/zeNfQf5MpN4IXwwMBlEP.jpg)
Terrorists and Army
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని తెలిపాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశారు. డ్రోన్లతో, ఐఈడీలతో దాడులు జరగవచ్చని హెచ్చరికలు చేస్తున్నారు. సముద్ర, నదీ మార్గాల ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ముంబయి 26/11 ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తున్న సమయంలో ఈ హెచ్చరికలు రావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.
Also Read: China: ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!
Terror Attack Alert
పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే శాఖను అప్రమత్తం చేస్తూ.. డ్రోన్లు, ఐఈడీల ద్వారా దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. 26/11 దాడుల సమయంలోనే 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబయిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. సీఎస్‌ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ మొదలైన ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారు. మూడు రోజుల వరకు ఈ మారణహోమం కొనసాగింది. ఈ దాడుల్లో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నాటి దాడిలో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు ఉగ్రదాడిలో అమరులయ్యారు.
Also Read: Whatsapp: వాట్సాప్ సేవల్లో అంతరాయం..!
ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులను చొరబాటు ప్రయత్నాలు భద్రతా దళాలు భగ్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ఒక సైనికుడు మరణించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. 9 పంజాబ్ రెజ్మింట్‌కు చెందిన జవాన్ కుల్దీప్ చంద్ అమరుడైనట్టు ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్‌లో తెలిపింది. ఏప్రిల్ 11 రాత్రి సుందర్‌బనిలోని కెరీ-బట్టల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు నిరోధక ఆపరేషన్‌ను ధైర్యంగా నడిపిస్తూ తన ప్రాణాలను అర్పించాడని పేర్కొంది.
మరోవైపు, కిష్టావర్ జిల్లాలోని మంచుతో కూడిన ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ తెలిపింది. అంతకుముందు రోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ‘ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కిష్టావర్ ఛత్రులో జరుగుతున్న ఆపరేషన్‌లో మరో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక AK, ఒక M4 రైఫిల్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు’ అని వైట్ నైట్ కార్ప్స్ Xలో పోస్ట్ చేసింది. గత నెలలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి కథువా జిల్లాలోకి చొరబడిన ఉగ్రవాదుల కోసం భారీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్చి 28న కథువాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు.
ఏడాది కాలంగా పాక్ ఉగ్రవాదులు ఉధంపూర్, దోడా, కిష్టావర్ జిల్లాల ఎత్తైన ప్రాంతాలు, అక్కడి నుంచి కశ్మీర్‌కు చేరుకోవడానికి కథువా ప్రధాన చొరబాటు మార్గంగా మారింది.
Also Read: AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..
Also Read: USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు
latest telugu news updates | latest-telugu-news | telugu-news | army-cops | intelligence-agency | intelligence | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu | pakistan