/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
Supreme Court
రాష్ట్రపతికి సంబంధించిన వ్యవహారాల్లో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు కలుగజేసుకుంది. రాష్ట్రపతికి గవన్నర్ పంపే బిల్లులపై అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్ తో పాటూ రాష్ట్రపతికీ గడువు విధించింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగానే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలనూ జత చేయాలని తెలిపింది. దాంతో పాటూ ఇకర మీదట ఇలాంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని మరీ చెప్పింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది.
Also Read : మయన్మార్ లో మరోసారి భూకంపం!
Also Read : బూట్లలో కుప్పలు తెప్పలుగా బంగారం.. మొత్తం ఎన్ని కేజీలంటే?
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇదంతా తమిళనాడులో జరుగుతున్న గొడవల కారణంగా వచ్చింది. 2021లో తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన మాజీ ఐపీఎస్ అధికారికి ఆర్.ఎన్. రవి కుమార్‌కు.. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తరచుగా వివాదాలు సాగుతున్నాయి. గవర్నర్ బీజేపీకి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. బిల్లులు, నియామకాలు అడ్డుకుంటున్నారని అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 10 బిల్లులను చాలా కాలంగా గవర్నర్ తన వద్దే ఉంచుకోవడంతో స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన కోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది. కేసు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించిన 3 నెలల వ్యవధిని.. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపించిన రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువుగా విధించడం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దాంతో పాటూ ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహాతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపాల్సి వస్తే దానికి గవర్నర్ ఒక్క నెల మాత్రమే గడువు తీసుకోవాలని చెప్పింది. అదే మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని వద్దనుకుంటే మూడు నెలల్లోకా తిరిగి బిల్లును శాసనసభకు పంపించాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.
Also Read: Ukraine: భారత కంపెనీలపై రష్యా దాడులు
Also Read : అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ..పూజారి పై దాడి!
governer | supreme-court | today-latest-news-in-telugu | latest-telugu-news | telugu-news | breaking news in telugu | national news in Telugu