/rtv/media/media_files/2025/04/02/sQVm38TNYm3OK9lv3QZi.jpg)
Waqf Bill
వక్ఫ్ చట్టంపై వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముర్షిదాబాద్ జిల్లాలో నిరసనలు అధికం కావడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి దూరి చోరీ చేశారు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను దోచుకున్న తర్వాత ఇద్దరిని కాల్చేసి వెళ్లిపోయారు. మరో వైపు సజూర్‌మోరె వద్ద 21 ఏళ్ల యువకుడు తుపాకీ కాల్పుల్లో గాయపడ్డాడు. ఈ యువకుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత..
ఇదిలా ఉండగా.. వక్ఫ్ సవరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం నుంచి నిరసనలు జరుగుతున్నాయి. శనివారం రోజున మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు 110 మందికి పైగా నిరసనాకారులను అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
ముర్షిదాబాద్ జిల్లాలో నిషేధాజ్ఞలు విధించామని, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశామని అధికారులు చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఘర్షణ జరిగిన సమయంలో ఆందోళనకారులపై జరిగిన కాల్పుల్లో 10 మంది పోలీసులు, ఓ యువకుడు గాయపడ్డారు. దీంతో వాళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
west bengal | crime news | latest-telugu-news | Waqf Bill 2025 | telugu-news | today-news-in-telugu | national news in Telugu