Amravathi: పట్టాలెక్కిన రాజధాని నిర్మాణం.. అమరావతి వెనుక ఎన్నో వివాదాలు, పోరాటాలు

కేంద్ర బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఏపీకి రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకు రాజధాని సమస్య ఏపీ ప్రజలను వెంటాడింది. ఎట్టకేలకు అమరావతియే రాజధానిగా నిర్మాణం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Amravathi: పట్టాలెక్కిన రాజధాని నిర్మాణం.. అమరావతి వెనుక ఎన్నో వివాదాలు, పోరాటాలు

2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.48.21 లక్షల కోట్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేసింది. అమరావతి కోసం రూ.15 వేల కోట్లు అందిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేసేందుకు ప్రతిపాదన చేశారు. ఇందుకు సంబంధించి అక్కడ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌.. రాజధానిగా అమరావతిని తిరస్కరించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడం, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో.. చివరికి మూడు రాజధానుల ఆలోచనను విరమించుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు తాను విశాఖపట్నంకు షిఫ్ట్‌ అవుతున్నానని.. ఎన్నికల తర్వాతే విశాఖపట్నమే ఏపీ రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తాము గెలిస్తే అమరావతినే రాజధానిగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చివరికి 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. అమరావతిలో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించారు.

Also read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…?

అమరావతి వివాదం
2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన కొన్ని నెలల తర్వాత అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు. 2015 అక్టోబర్ 22న ప్రధాన మంత్రి మోదీ రాజధాని నిర్మాణానికి అమరావతిలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని 8603.32 Sq కిలోమీటర్ల వరకు విస్తరింపజేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అమరావతిలో రైతుల నుంచి 34,400 ఎకరాల భూమిని సేకరించింది. అలాగే ఏపీసీఆర్‌డీఏ (APCRDA) వివిధ బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల నిధులు సేకరించింది. మొత్తంగా అమరావతి రాజధానిని 53,748 ఎకరాల్లో నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. 2016లో అమరావతి నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.

తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ఇప్పటికే అక్కడ పూర్తయ్యాయి. 2019లో టీడీపీ ఓడిపోయిన అనంతరం వైసీపీ అమరావతి ప్రణాళికను రద్దు చేసింది. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీనిపై టీడీపీతో పాటు అమరావతి రైతులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారించిన ఏపీ న్యాయస్థానం.. అమరావతిలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో వైసీపీ పార్టీ మూడు రాజధానులకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

Also read: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు!

వైసీపీ హయాంలోనే మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నిరసలు చేయడం ప్రారంభించారు. మొత్తం 1,631 రోజుల పాటు నిరసనలు జరిగాయి. చివరికి 2024లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అమరాతిని రాజధానిగా ప్రకటించారు. ఇప్పటికే అక్కడ పనులు ప్రారంభమయ్యాయి.

2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధాని వ్యయం అంచనాలు

ప్రభుత్వ కాంప్లెక్స్‌లకు రూ.1,556 కోట్లు
అసెంబ్లీ భవనానికి రూ.555 కోట్లు
హైకోర్టు, సెక్రటేరియట్ భవనాలకు రూ.3,536 కోట్లు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్‌ అధికారులు, అధికారులు, ఎన్జీవో నివాసాలకు రూ.3, 539 కోట్లు
29,900 మంది రైతులు మొత్తం 34,281 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చేశారు
రాజధాని నగరం 53,748 ఎకరాల్లో నిర్మించాలని ప్లాన్ చేశారు
8,603 sq km వరకు రాజధానిని విస్తరించాలని ప్రణాళిక రూపొందించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.

New Update
ap cabinet

ap cabinet Photograph: (ap cabinet)

అమెరికాల టారిఫ్ ల భారం ప్రభావం ఏపీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే మత్స్య ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులకు చాలా గట్టిగా తగిలింది. దీంతో తాము చాలా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిషయం గురించి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు, హేచరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమని, ఆక్వా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు సూచించారు. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని కోరారు. ఆక్వా రంగం సమస్యల పరిష్కారం కోసం 11 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

సుంకాల భారం నుంచి బయటపడటానికి, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు.. మొత్తం 11 మంది ఉంటారు. రైతుల నుంచి కె.రఘు, కుమారరాజు, రామరాజు (ఏపీఐఐసీ ఛైర్మన్‌), శ్రీకాంత్‌.. ఎగుమతిదారుల నుంచి కె.ఆనంద్, ఆనంద్‌కుమార్, ఎన్‌.వెంకట్, డి.దిలీప్‌.. హేచరీల ప్రతినిధులుగా పీవీబీ కుమార్, ఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, ఫీడ్‌ మిల్లుల తరఫున సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉంటారు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించి రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి చంద్రబాబు సూచించారు.

ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మళ్లీ సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులున్నారని.. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఇది ఊహించని సమస్య అని.. ఈ సమస్య పై రైతులు ఓపికగా ఉండాలన్నారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాల భారాన్ని రైతుల పైకి నెట్టకుండా వ్యాపారులు, ఫీడ్‌మిల్లులు, హేచరీలు బాధ్యత తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రొయ్యకు స్థానిక వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పరిస్థితి చక్కబడే వరకు రైతుకు ధైర్యం కల్పించాలని.. రైతుకు గిట్టుబాటు రేటు ఇచ్చేలా వ్యాపారులు చూడాలి అన్నారు. కొంతమంది రైతులు క్రాప్ హాలిడే అని ప్రకటించడంతో.. ఈ అంశంపైనా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చించనుంది.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

cbn | trump | tarriffs | trump tariffs | trump tariffs india | trump tariffs news | trump tariff war | donald trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment