Horoscope: ఈ రాశి వారు నేడు ఖర్చుల విషయంలో జాగ్రత్త..!

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోవచ్చు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..

New Update
Horoscope

Horoscope

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశించిన ఫలితాల కోసం శ్రమించాలి. సన్నిహితులతో సత్సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తారు. మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలు ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.

Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. విశేషమైన గ్రహబలం ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. 

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోవచ్చు. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదంతో రోజంతా గడుపుతారు. ఇంటి దగ్గర పరిస్థితులు కూడా పూర్తిగా నిరాశాజనకంగా ఉంటాయి.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనఃసౌఖ్యం ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. సాహసోపేతమైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి.

సింహరాశి వారికి ఈ రోజు నిరాశాజనకంగా ఉంటుంది. గ్రహబలం అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సత్సాంగత్యంతో కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరిగే సూచన ఉంది. స్థానచలనం కూడా ఉండవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. గృహాలంకరణ కోసం ధనవ్యయం చేస్తారు. ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. 

వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్ధిక ప్రయోజనాలు గొప్ప ఆనందం కలిగిస్తాయి. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు కలిసి అద్భుతాలు చేస్తాయి. చేపట్టిన పనులను సకాలంలో విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు ప్రణాళికలు చేపడతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. 


మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు.


కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం, సంపద, సంతోషం అనుగ్రహం . విలాస వస్తువుల కోసం ధనవ్యయం చేస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

మీనరాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. గ్రహ సంచారం సరిగా లేనందున ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వివాదాలకు, అవమానకర సంఘటనలకు దూరంగా ఉంటే మంచిది. కొత్త పనులు, ప్రయాణాలు వాయిదా వేయండి. వృధా ఖర్చులు నివారించాలి.

Also Read: RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎప్పటినుంచంటే !

Also Read: Delhi: ఢిల్లీలో భానుడి భగభగ.. సీజన్‌లో ఆల్ టైం రికార్డు స్థాయి టెంపరేచర్

horoscope | horoscope-today | todays-horoscope | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fridge Ice: ఫ్రిజ్‌లో ఐస్ పేరుకుపోతుందా.. ఈ ఒక్క పని చేయండి

ఫ్రిజ్‌లో ఐస్‌ పేరుకుపోవడం కూడా రిఫ్రిజిరేటర్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఫ్రిజ్ తలుపు తెరిచి వెంటనే మూసివేయడం ఉత్తమం. ఫ్రీజర్ ఎంత ఖాళీగా ఉంటే అంత ఎక్కువగా మంచు పేరుకుపోతుంది. ఫ్రిజ్‌లో అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచాలని చెబుతున్నారు.

New Update
Refrigerator Ice

Refrigerator Ice

Refrigerator Ice: ఫ్రీజర్‌లో ఐస్‌ గడ్డ కట్టడం సాధారణం. అయితే కొన్ని రిఫ్రిజిరేటర్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎంత తొలగించినా ఫ్రీజర్‌లో చాలా మంచు పేరుకుపోతుంది. ఇది మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తుంది. అయితే దానిని అలాగే ఉంచడం వల్ల అందులో నిల్వ చేసిన ఆహారంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పదార్థాల నుండి తేమను తొలగించేటప్పుడు అవి ఎండిపోయి, గట్టిపడి వాటి రంగు, రుచిని కోల్పోతాయి. ఫ్రిజ్‌లో ఐస్‌ పేరుకుపోవడం కూడా రిఫ్రిజిరేటర్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ఇలాంటి సమస్య ఉంటే కొన్ని సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుకోవచ్చు. రిఫ్రిజిరేటర్ పనితీరును పెంచవచ్చు.

ఫ్రిజ్ తలుపు తెరిచి వెంటనే..

కొంతమంది తరచుగా ఫ్రిజ్ తలుపు తెరుస్తారు. అవసరమైనప్పుడు మాత్రమే ఫ్రిజ్ తలుపు తెరిచి వెంటనే మూసివేయడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. తలుపులపై ఉన్న రబ్బరు సీలింగ్ గాస్కెట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? తనిఖీ చేయడం కూడా ముఖ్యం. అవసరమైతే  ఫ్రిజ్ కంపెనీని బట్టి వీటిని 2-5 సంవత్సరాల మధ్య మార్చడం మంచిది. దీనివల్ల ఫ్రిజ్ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రిఫ్రిజిరేటర్ మోడల్‌ను బట్టి మాన్యువల్‌లో వివరించిన విధంగా ఫ్రీజర్ థర్మోస్టాట్‌పై తగిన సెట్టింగ్‌లను చేయడం ద్వారా ఫ్రీజర్‌లో మంచు పేరుకుపోకుండా నిరోధించవచ్చు. కొన్ని ఫ్రిజ్‌లలో ఆటో-డీఫ్రాస్ట్ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ఫ్రిజ్‌లలో ఇది ఉండదు.

ఇది కూడా చదవండి: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించ వద్దు

అలాంటి సందర్భాలలో శీతలీకరణ వ్యవస్థతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా డీఫ్రాస్ట్ బటన్‌ను నొక్కడం గుర్తుంచుకోవాలి. కాబట్టి అప్పటి వరకు పేరుకుపోయిన మంచు కరిగిపోతుంది. ఆహార పదార్థాలను నిల్వ చేసే ప్రక్రియలో కొన్నిసార్లు వాటి అవశేషాలు, ద్రావణాలు, ఐస్ క్రీం మొదలైనవి ఫ్రిజ్‌లోనే ఉంటాయి. అలాంటి సమయాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడం మంచిది. అలాగే రెగ్యులర్ వ్యవధిలో వేడి నీరు, బేకింగ్ సోడా మిశ్రమంతో ఫ్రీజర్‌ను శుభ్రం చేయడం వల్ల రిఫ్రిజిరేటర్ నుండి దుర్వాసనలు వెలువడకుండా నిరోధించవచ్చని నిపుణులు అంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఫ్రిజ్‌లో అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచాలని నిర్ధారించుకోండి. ఫ్రీజర్ ఎంత ఖాళీగా ఉంటే అంత ఎక్కువగా మంచు పేరుకుపోతుందని చెబుతున్నారు.
 
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: మామిడి పండ్లు తినేప్పుడు ఈ తప్పులు చేయొద్దు

fridge | refrigerator-tips | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment