/rtv/media/media_files/2025/04/08/lN2ALBqs2Z2sZlEBarFq.jpg)
money
అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.
Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!
తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.
కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.
నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates