Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఎక్సైజ్ శాఖకు రూ. 34,600 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త దుకాణాల దరఖాస్తుల ద్వారా రూ. 264.50 కోట్లు సమకూరాయి. పన్నుల రూపంలో రూ. 7,000 కోట్లు వచ్చాయి.

New Update
liquor

తెలంగాణలో మందు బాబులు తెగ తాగేసి అమ్మకాలకు కిక్కించారు. గతేడాదే అమ్మకాలు జోరుగా సాగాయంటే.. ఈసారి అంతకు మించి అన్నట్టుగా మందుబాబులు సత్తా చాటారు. ఫలితంగా.. ఎక్సైజ్‌ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏడు శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగానికి మొత్తం రూ. 34,600 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

ఈ ఏడాది కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల రూపంలోనే ఏకంగా రూ. 264.50 కోట్లు ఆదాయం లభించిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అలాగే మద్యం అమ్మకాలపై పన్నుల రూపంలో రూ. 7,000 కోట్లు ఆదాయం పొందినట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించనుంది.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

2024–25 సంవత్సరంలో బీరు అమ్మకాలు 531 లక్షల కేసులకు చేరుకున్నాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బీరు అమ్మకాల్లో మూడు శాతం తగ్గినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మద్యం అమ్మకాలు పెరిగినా బీర్ల అమ్మకాలు తగ్గటానికి.. బీర్ల ధరల పెంపు, బీర్ల కంపెనీలు సుమారు 15 రోజుల పాటు సరఫరాను నిలిపివేయడం లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక హార్ట్ లిక్కర్ అమ్మకాల విషయానికి వస్తే, గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది రెండు శాతం వృద్ధి నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్‌ అమ్మకాలు ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతునే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.మొత్తంగా.. తెలంగాణలో మద్యం వినియోగం తగ్గడం కాదు, ఏడేళ్లుగా పెరుగుతూనే ఉంది. అంటే ఏడేళ్లుగా మందుబాబులు అలుపెరుగకుండా సత్తా చాటుతూ.. రాష్ట్ర ఖజనాకు కాసుల కిక్కు ఎక్కిస్తూనే ఉన్నారు. 

మద్యం ధరలు పెరగడం, సరఫరాలో లోపాలు వంటి అంశాలు కొంతమేర ప్రభావం చూపుతున్నప్పటికీ.. అవేవీ పట్టించుకోకుండా మందుబాబులు అహర్నిషలు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు చివరి పెగ్గు వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మొత్తం ఆదాయంపై అవి పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. ఎక్సైజ్ శాఖ ఆదాయంలో సంవత్సరానికొకసారి వచ్చే పెరుగుదల ప్రభుత్వ ఖజానా పెరుగుదలకే సంకేతమని అధికారులు అభిప్రాయపడ్డారు.

Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

Also Read:  Horoscope: ఈ రాశి వారు నేడు ఖర్చుల విషయంలో జాగ్రత్త..!

telangana | liquor-sales | liquor sales high in telangana | record level liquor sales in telangana | telangana huge liquor sales | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment