/rtv/media/media_files/2025/02/18/4rq4prfTGiMLUZbAFZXZ.jpg)
Vallabhaneni Vamsi |
Vallabhaneni Vamsi: గత కొన్ని రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు బెయిల్ మంజారు చేసింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన భూకబ్జా కేసులో వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కృష్ణా జిల్లా ఆత్కూరులో వల్లభనేని వంశీమోహన్ ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ కేసు ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట
ఈ పిటిషన్ మీద ఇటీవల వాదనలు విన్న గన్నవరం కోర్టు.. ఇరు పక్షాల వాదనల అనంతరం తీర్పును ఇవాళ్టికి (సోమవారం) వాయిదా వేసింది. తాజాగా తీర్పు వెల్లడించిన గన్నవరం కోర్టు వల్లభనేని వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం విజయవాడ జైలులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. భూకబ్జా కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. సత్యవర్ధన్ కేసులో రిమాండ్ ఉండటంతో.. వల్లభనేని వంశీ జైళ్లోనే ఉండనున్నారు. ఈ రెండు కేసులే కాక మరికొన్ని కేసుల్లోనూ ఆయన నిందితుడిగా ఉండగా.. వీటీపై విచారణ కొనసాగుతోంది.
Also Read: అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి పోలీసులకు కీలక సమాచారం అందినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు నేపాల్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆయనతో పాటుగా మరికొంతమంది నేపాల్‌లో ఉన్నట్లు సమాచారం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీతో పాటుగా 12 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో కొంతమంది ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. కొమ్మా కోటేశ్వరరావు సహా మరికొంతమంది పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే భూకబ్జా కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. సత్యవర్ధన్ కేసులో వల్లభనేని వంశీ మోహన్ జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మిగిలిన కేసులకు సంబంధించి కూడా బెయిల్ కోసం వంశీ సంబందీకులు ప్రయత్నం చేస్తున్నారు.
Also read : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో తులం రూ.56 వేలకు?
Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట