Diabetes
Diabetes: కుటుంబంలో ఎవరికైనా, ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒకరికి డయాబెటిస్ ఉన్నప్పుడు పిల్లలకు ఈ వ్యాధి వస్తుందేమో అని ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా తండ్రికి డయాబెటిస్ ఉన్నప్పుడు పిల్లలకు కూడా డయాబెటిస్ వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇందులో జన్యుశాస్త్రం ఉన్నా జీవనశైలి చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తికి కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉంటే వారు డయాబెటిస్ బాధితులుగా మారే అవకాశాలు పెరుగుతాయి. కానీ తండ్రికి వచ్చే మధుమేహం సంతానంలో కూడా వస్తుందని పూర్తిగా చెప్పలేమంటున్నారు వైద్యులు.
తప్పుడు ఆహారపు అలవాట్లు:
టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కుటుంబాలలో ఎక్కువగా ఉంటుంది. కానీ సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా దీనిని నివారించవచ్చంటున్నారు. డయాబెటిస్ కేవలం జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే రాదని నిపుణులు నమ్ముతారు. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే తర్వాత రానికి ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. కానీ దానికి ప్రధాన కారణాలు క్రమరహిత దినచర్య, ఊబకాయం, తప్పుడు ఆహారపు అలవాట్లు. టైప్ 2 డయాబెటిస్‌లో జన్యు నమూనా అస్పష్టంగా ఉంది. అయితే ఈ వ్యాధి ఉన్న తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉంటే అప్రమత్తంగా ఉండాలి.
ఇది కూడా చదవండి: ధూమపానం చేయని వారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్
ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం ద్వారా మధుమేహాన్ని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. దానికోసం ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చక్కెరతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు, కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించాలి. మధుమేహాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన తీవ్రత వ్యాయామం చేయండి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మధుమేహం ప్రారంభ లక్షణాలు తరచుగా మూత్రవిసర్జన, దాహం పెరగడం, అలసట, దృష్టి మసకబారడం, బరువు తగ్గడం. కుటుంబంలో ఎవరికైనా మధుమేహ చరిత్ర ఉండి లక్షణాలు కనిపిస్తే రక్తంలో చక్కెర పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ చల్లటి ఆహారాలను తింటున్నారా..? మీ జీర్ణవ్యవస్థ డేంజర్‌లో ఉన్నట్లే!!
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)