USA: గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు

ధనవంతుల కోసం ప్రవేశపెట్టిన అమెరికా పౌరసత్వ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు.  ఈరోజు జరిగిన ఎయిర్ ఫోర్స్ వన్ లో మీడియాతో మాట్లాడుతూ దాన్ని చూపించారు. మొదటి కార్డును తానే కొన్నానని కూడా చెప్పారు. 

New Update
usa

Gold Card

గోల్డ్ కార్డు...ఇది కొనుక్కుంటే అమెరికా పౌరసత్వం ఇట్టే వచ్చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యనే దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా ఈ కార్డ్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. తన ఫోటోతో ఉన్న గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 5 మిలియన్ డాలర్లు ఉంటే దీనిని ఎవరైనా సొంతం చేసుకోవచ్చును. మొదటి కార్డును తానే కొన్నానని..రెండోది ఎవరు కొంటారో తెలియదని ట్రంప్ అన్నారు.  

5 మిలియన్లకు గోల్డ్ కార్డ్..

ఈ గోల్డ్ కార్డుల ద్వారా అమెరికాకు ఫైనాన్స్ ఉన్న లోటును పూరించవచ్చని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. సుమారు ఒక మిలియన్ గోల్డ్ కార్డులు ఇస్తామని తెలిపారు. దీంతో వచ్చిన మొత్తంతో అమెరికాలో ఉద్యోగాలు సృష్టించవచ్చని చెబుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులను శాశ్వత నివాసితులుగా మార్చడానికి అనుమతించే "EB-5" వలస పెట్టుబడిదారు వీసా కార్యక్రమాన్ని "గోల్డ్ కార్డ్"తో భర్తీ చేస్తామని ట్రంప్ చెప్పారు. దీని ద్వారా ధనవంతులు తమ దేశంలోకి వస్తారని అన్నారు. అంతేకాదు అమెరికా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తొందరలోనే చెబుతామని  తెలిపారు.  ఇది రష్యన్లతో సహా అన్ని దేశాల వారికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. EB-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామన్నారు ట్రంప్. చట్టబద్ధంగా రావాలనుకున్న ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. 

 

 today-latest-news-in-telugu | usa | america president donald trump | american-citizenship

 

Also Read: IPL 2025: రెండు చేతులతో బౌలింగ్..ఏం టాలెంట్ రా భయ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట

అమెరికాలో వీసాలు రద్దయిన విద్యార్థులకు అక్కడి న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ను న్యాయస్థానం పునరుద్ధరించింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. 

New Update
F1 Visa

F1 Visa

ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(సెవీస్‌) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థులలో సగం మంది భారతదేశానికి చెందిన వారు కాగా 14 శాతం మంది చైనా విద్యార్థులని ఏఐఎల్‌ఏ ప్రకటించింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన వారని తెలిపారు. 

ఇప్పుడు వీరందరికీ అక్కడి న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ను న్యాయస్థానం పునరుద్ధరించింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.  విద్యార్థుల వీసాల రద్దులో ప్రభుత్వం నిర్ణయం సరికాదని ఇమ్మిగ్రేషన్ లాయర్లు చెప్పారు. అయితే అమెరికా ప్రభుత్వ ఏజెన్సీల వాదన మాత్రం వేరేగా ఉంది. విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల దృష్టిలోపడ్డారని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తాము తాత్కాలికంగా అడ్డుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెబుతున్నాయి. కానీ, ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదు.

అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు ఏకపక్షంగా జరుగుతున్నట్లు ఏఐఎల్‌ఏ ఆందోళన వ్యక్తం చేసింది. తాము సేకరించిన కేసుల నివేదికలలో 86 శాతం కేసులు ఏదో ఒక స్థాయిలో పోలీసులతో సంప్రదింపులకు నోచుకున్నాయని, 33 శాతం వీసాలు రద్దయిన కేసులలో అభియోగాలు నమోదు చేయకపోవడం, వారిపై కేసులు పెట్టడం లేదని ప్రకటన తెలిపింది.

గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో 70 కిలోమీటర్ల వేగంతోడ్రైవ్‌ చేయడం, చట్టవిరుద్ధంగా వాహనం పార్కింగ్‌ చేయడం, సీటు బెల్టు ధరించకపోవడం, నెంబర్‌ ప్లేట్లు గడువు తీరిపోవడం వంటి చిన్న చిన్న అభియోగాలతో పోలీసుల నుంచి ఓపీటీ విద్యార్థులకు నోటీసులు అందాయి. వీసా రద్దుకు గురైన విద్యార్థులలో ఇద్దరు విద్యార్థులకు మాత్రమే రాజకీయ నిరసనలలో పాల్గొన్న చరిత్ర లేదని ఏఐఎల్‌ఏ తెలిపింది. వీసా రద్దుకు సంబంధించిన ఈమెయిర్‌ నోటీసులు అందుకున్న మెజారిటీ విద్యార్థులకు ఈ నోటీసు వీసాను మంజూరు చేసిన కాన్సులేట్‌ నుంచి వచ్చినట్లు ఏఐఎల్‌ఏ పేర్కొంది. 

 today-latest-news-in-telugu | usa | student-visa

Also Read: Danish Kaneria: ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా

Advertisment
Advertisment
Advertisment